కడప జిల్లా : బ్రహ్మంగారి మఠం వివాదం రోజు రోజుకు ముదురుతోంది. బ్రహ్మంగారి మఠంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మెన్ శ్రీకాంత్ పై నిన్న కొందరు దాడికి ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దాడికి పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ దాడికి ప్రయత్నించిన ఘటనలో ఐదు మందిపై కేసు నమోదు అయింది. బంకు శీను, దీప్తి రమణారెడ్డి బాబ్జి, శ్రీ రాములు నారాయణ రెడ్డి అనే వ్యక్తులపై 452, 342, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా నిన్న బ్రహ్మంగారి మఠంలో విశ్వ బ్రాహ్మణుల మీడియా సమావేశాన్ని అడ్డుకున్న గ్రామస్తులు… గ్రామంలో వివాదాలు సృష్టించేలా విశ్వ బ్రాహ్మణులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివస్వామిపై ఆరోపణలు చేస్తే తాము సహించేది లేదంటూ విశ్వబ్రాహ్మానులను అడ్డుకున్నారు గ్రామస్థులు. పీఠాధిపతి ఎంపిక పూర్తయ్యాక ఎందుకు మళ్ళీ వివాదం సృష్టిస్తున్నారని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ ఆచారిని గ్రామస్థులు నిలదీశారు.