కడప జిల్లా పులివెందుల మండలంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లెకు చెందిన పార్థసారథి రెడ్డిపై పులివెందుల ఎంపీపీ శివప్రసాద్ రెడ్డి కాల్పులు జరిపారు. కాల్పుల్లో పార్థసారథిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పార్థసారథి రెడ్డి మరణించాడనే భయంతో ఆత్మహత్య చేసుకుని ఎంపీపీ శివ ప్రసాద్ మరణించారు.అయితే ఈ ఘటనకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణమని.. వాళ్ళు ఇద్దరు బంధువులే అని స్థానికులు అంటున్నారు. కాగా విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు…కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.