ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌పై ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. మొత్తం ఆరు ప్రదేశాల్లో దాడులు చేశారు. ఈ దాడిలో 100 మందికి పైగా మృతి చెందినట్టు ఆఫ్ఘన్ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడులకు పాల్పడింది తామే అని ఐఎస్ కే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఐసిస్ ఖోరోసన్ ను ఐఎస్ కే గా పిలుస్తారు. ఐసిస్ ఖోరోసన్ అంటే ఏమిటి? తెలుసుకుందాం. 2014లో ఇరాక్, సిరియా దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ ఖలీఫా ఏర్పడిన తరువాత, పాకిస్తాన్‌కు…
కాబూల్ ఎయిర్‌పోర్ట్ వరస బాంబు పెలుళ్లతో దద్దరిల్లిపోతున్నది. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్ట్ వద్ద 6 పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 72 మంది మృతి చెందారు. ఇందులో సాధారణ పౌరులు 60 మంది ఉండగా, 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ పేలుళ్లు జరగడానికి కొన్ని గంటల ముందు కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 160 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. 160 మందిలో 145 మంది…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్ల ఆక్రమణ తరువాత అక్కడ అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలను గౌరవిస్తామని తాలిబన్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలా జరగడంలేదు. మహిళలను రకరకాలుగా హింసిస్తూనే ఉన్నారు. ఒంటరిగా బయటకు వస్తున్న మహిళలను తాలిబన్ ఫైటర్లు హింసిస్తున్నారు. దీనిపై తాలిబన్ నేతలు ఓ వింత ప్రకటన చేశారు. తమ ఫైటర్లకు ఇంకా మహిళలను గౌరవించడం తెలియడం లేదని, వారికి త్వరలోనే మహిళలను ఎలా గౌరవించాలో నేర్పుతామని, అప్పటి వరకు ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇంటి నుంచి బయటకు రావొద్దని…
అంతా అనుకున్నట్టుగానే జరిగింది. ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా అగ్రరాజ్యాల నిఘావ్యవస్థలు హెచ్చరించిన కొద్దిసేపటికే కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 72 మంది మృతి చెందగా, 140 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తామే కారణమని ఇప్పటికే ఐసిస్ ప్రకటించింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డవారి ఫొటోలను కూడా ఐసిస్ రిలీజ్ చేసింది. కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దాడులు జరిగిన కాసేపటి తరువాత సెంట్రల్ కాబూల్‌లో మరోపేలుడు సంభవించినట్టు సమాచారం.…
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తరువాత అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆగస్టు 31 లోగా దేశం విడిచి వెళ్లాలని తాలిబన్లు ఇప్పటికే అమెరికా దళాలను ఆదేశించారు. ఇక ఇదిలా ఉంటే, నిన్నటి రోజున ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, కాబూల్ ఎయిర్‌పోర్టు వైపు ఎవరూ రావొద్దని అగ్రదేశాల నిఘా సంస్థలు హెచ్చరించారు. ఈహెచ్చరికలు జరిగిన గంటల వ్యవధిలోనే కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద రెండు బాంబుదాడులు జరిగాయి. ఈ దాడిలో 72 మంది మృతి చెందగా, 140…
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చెరలో ఉండిపోయింది. ఒక్క పంజ్‌షీర్ ప్రావిన్స్ మినహా మొత్తం తాలిబన్ల వశం అయింది. అయితే, ఇప్పుడు ఆఫ్ఘన్ అధికారులు ఓ విషయంపై ఆందోళనలు చెందుతున్నారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని జ్వాజియన్ ప్రావిన్స్ లో తిల్యాతోపే అనే ప్రాంతంలో పెద్ధ ఎత్తున నిధులు బయటపడ్డాయి. సోవియట్ యూనియన్ ఆధీనంలో ఆఫ్ఘన్ ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో 20,600 వరకు వస్తువులు బయటపడ్డాయి. నాణేలు, ఇతర వస్తువులు వంటివి…
ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. తాలిబన్ల ఆక్రమణలతో అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. మళ్లీ 1996 నాటి పరిస్థితులు వస్తాయని భయపడుతున్నారు. భయపడినట్టుగానే జరుగుతున్నది. శాంతి మంత్రం జపిస్తూనే కాల్పులకు తెగబడుతున్నారు. మహిళలపై విరుచుకుపడుతున్నారు. ఎలాగైనా తప్పించుకొని దేశం దాటిపోవాలని చూస్తున్నవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు కాబూల్‌లో మరో సంఘటన జరిగింది. ఉక్రెయిన్‌కు చెందిన విమానాన్ని దుండగులు హైజాక్ చేశారు. విమానం హైజాక్ అయినట్టు…
ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌ను సైతం స్వాధీనం చేసుకున్నాం.. ఇక, మాకు ఎదురేలేదు అని భావిస్తున్న తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది.. ఆఫ్ఘనిస్థాన్‌లోని దక్షిణ ప్రాంతంలోని ఆండ్రాబ్ ప్రావిన్స్‌లో తాలిబాన్-ఆఫ్ఘన్ సైన్యం మధ్య భీకర యుద్ధమే నడుస్తోంది… తాలిబన్లు స్వాధీనం చేసుకోని కొన్ని ప్రాంతాల్లో పంజ్‌షీర్ లోయ ఒకటి కాగా.. ఆ ప్రాంతానికి వెళ్లిన తాలిబన్లకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. ఆంధ్రాబ్ ప్రావిన్స్‌లో జరిగిన పోరులో ఇప్పటి వరకు 50 మందికి పైగా తాలిబన్ ఫైటర్లు మరణించినట్టుగా తెలుస్తోంది……
ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. తాలిబన్ల ఆక్రమణలతో ప్రజలు భీతిల్లిపోతున్నారు. ఎటునుంచి ఎవరు దాడులు చేస్తారో అని ప్రాణాలు గుప్పిట పట్టుకొని దొరికిన విమానం పట్టుకొని దేశం విడిచి పారిపోతున్నారు. సామాన్యులతో పాటుగా ఆఫ్ఘన్ నేతలు కూడా వివిధ దేశాలకు పారిపోతున్నారు. గత ప్రభుత్వంలోని నేతలను ఏమి చేయబోమని తాలిబన్లు హామీ ఇస్తున్నా, వారి హామీలను ఎవరూ నమ్మేస్థితిలో లేరనే సంగతి తెలిసిందే. ఇలా ఆఫ్ఘన్ నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వచ్చిన ఎంపీ నరేందర్ సింగ్…
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నాక అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు కాబూల్ నగరంలో హ్యాపీగా తిరుగుతున్న యువత ఒక్కసారిగా ఇళ్లకు పరిమితం అయ్యారు. పెద్ద సంఖ్యలో ఆఫ్ఘనిస్తానీయులు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్టులో అమెరికా సీ 17 విమానం ద్వారా రికార్డ్ స్థాయిలో 640 మందిని తరలించారు. ఇది పాసింజర్ రైలు కాదని, అమెరికా సీ 17 విమానం అని అమెరికా ఆర్మీ పేర్కొన్నది. అయితే, ఆ విమానంలో ప్రయాణం చేసింది640 మంది కాదని,…