తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయిన ఆఫ్ఘనిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేశారనే వార్తలు హల్ చల్ చేశాయి.. కార్యాలయ సిబ్బందిని మొత్తం భారత్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతుండగా.. కార్యాలయం మూసివేశారని వార్తలు గుప్పుమన్నాయి.. అయితే, వాటిపై స్పందించిన కేంద్రం.. అసలు కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయలేదని క్లారిటీ ఇచ్చింది.. కాబూల్‌లోని భారత ఎంబసీలో సేవలు కొన సాగుతున్నాయని స్పష్టం చేసిన కేంద్రం.. దాదాపు 1,650 మంది భారతీయులు.. తిరిగి స్వదేశానికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారుని వెల్లడించింది.…
నిన్నటి వరకు ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అరాచకపాలన మొదలౌతుందని, అనేక ప్రాంతాల్లో అప్పటికే ఆ తరహా పాలన మొదలైందని ప్రజలు భయపడ్డారు. నెల రోజుల క్రితం నుంచి తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో కార్యాలయాలు, పాఠశాలలు తెరుచుకోకపోడంతో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదేవిధమైన పాలన కొనసాగుతుందని అనుకున్నారు. అయితే, అధికారం మార్పిడి జరుగుతున్న సమయంలోనే తాలిబన్ నేతలు కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరి ఇళ్లలోకి చొరబడొద్దని,…
తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత 2001 కి ముందు పరిస్థితులు వస్తాయోమో అని చెప్పి చాలామంది ప్రజలు దేశాన్ని వదిలి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. మరోవైపు ప్రభుత్వానికి సహకరించిన వారి వివరాలు సేకరిస్తున్నారనే వార్తలు రావడంతో ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. వీలైనంతవరకు దేశాన్ని వదిలి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో తాలిబన్ నేతలు కీలక ప్రకటన చేశారు. ఎవరి ఇళ్లలోకి చొరబడొద్దని, ఆయుధాలు తీసుకోవద్దని, ప్రజల ఆస్తులను…
కాబూల్‌లో ప్రస్తుం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉండేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకున్నా ఆ తరువాత ఎలాంటి సంఘటనలు జరుగుతాయే, మహిళలను ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే. అందుకోసమే వీలైనంత వరకు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటికే ఎంబసీలు మూసేయ్యడంతో విదేశాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దీనికోసం భారత ప్రభుత్వం ఇ ఎమర్జెన్సీ ఎక్స్ మిస్క్ వీసా విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీనికోసం…
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో రాజధాని కాబూల్‌లోని అన్ని దేశాలు తమ ఎంబసీలను ఖాళీ చేసి స్వదేశం వెళ్లిపోతున్నాయి. అధికారులను, భద్రతా సిబ్బందిని స్వదేశానికి తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు కాబూల్ విమానశ్రయం నుంచి భారత రాయబార అధికారులు, భద్రతా సిబ్బంది 120 మందిని సీ 17 వైమానిక విమానం ద్వారా ఇండియాకు తరలించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు సీ 17 విమానం చేరుకున్నది. కాబూల్ నుంచి వచ్చిన వీరికి విదేశాంగ శాఖాధికారులు స్వాగతం పలికారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న…
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా భయం భయంగా తిరుగుతున్న ప్రజలు కనిపిస్తున్నారు. ఎవరు ఎటునుంచి వచ్చి కాల్పులు జరుపుతారో… ఎవర్ని ఎత్తుకుపోయి చంపేస్తారో.. ఏ మహిళ కనిపిస్తే ఏం చేస్తారో అని భయాందోళనల మధ్య కాలం వెల్లబుచ్చుతున్నారు. కాబూల్ నగరం చుట్టూ తాలిబన్లు పహారా కాస్తుండటంతో బయటకు వెళ్లేందుకు అవకాశం లేదు. ఇప్పుడున్న ఏకైక మార్గం కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానంలో ఏదోక దేశం వెళ్ళి తలదాచుకోవడమే. దీంతో పెద్ద సంఖ్యలో ఆఫ్ఘన్ ప్రజలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు ఇంకా పూర్తిగా అధికారాన్ని చేజిక్కించుకోకముందే తమ ఆరాచక పాలనను మొదలుపెట్టారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో షరియా చట్టాలను అమలు చేస్తున్నారు. దీనికి సంబందించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబూల్‌లోని ప్రజలను ఏమీ చేయబోమని చెబుతూనే, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, యూఎస్ ఆర్మీకి సహకరించిన వారి వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. ఇంటింటికి వెళ్లి వివరాలు కనుక్కునే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో కాబూల్ వాసుల్లో తెలియని భయం నెలకొన్నది. ఇప్పటి వరకు సాధారణ జీవనం…
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయ్యాక ఆక్కడ పరిస్థితులను రష్యా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. 2001 కి ముందు కూడా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను పరిపాలించారు. అయితే, వారి అరాచక పాలన ఎంతో కాలం సాగలేదు. 2001లో ఉగ్రవాదులు అమెరికా వరల్డ్ ట్రేడ్ టవర్స్‌పై దాడులు చేసి కూల్చివేసిన తరువాత అమెరికా సైన్యం ఆఫ్ఘన్ లోకి అడుగుపెట్టి తాలిబన్లను తరిమికొట్టింది. అంతకు ముందు అంటే, 1979 ప్రాంతంలో అఫ్ఘన్‌కు రష్యా సహకారం అందించింది. ఆప్రాంతాన్ని సోవియట్ యూనియన్ తమ ఆధీనంలోకి…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో దళాలు తప్పుకోవడంతో ఆ దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సెప్టెంబర్ 11 వరకు పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా, ఆ ప్రక్రియను అమెరికా వేగవంతం చేయడంతో తాలిబన్లు దురాక్రమణకు పాల్పడ్డాయి. వేగంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నాయి. ఆదివారంరోజున రాజధాని కాబూల్ నగరంలోకి ప్రవేశించడంతో ఆఫ్ఘన్ తాలిబన్ల వశం అయింది. ఈ పరిస్థితికి అమెరికానే కారణం అని ప్రపంచం మొత్తం విమర్శలు చేస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్…