ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌పై ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. మొత్తం ఆరు ప్రదేశాల్లో దాడులు చేశారు. ఈ దాడిలో 100 మందికి పైగా మృతి చెందినట్టు ఆఫ్ఘన్ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడులకు పాల్పడింది తామే అని ఐఎస్ కే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఐసిస్ ఖోరోసన్ ను ఐఎస్ కే గా పిలుస్తారు. ఐసిస్ ఖోరోసన్ అంటే ఏమిటి? తెలుసుకుందాం. 2014లో ఇరాక్, సిరియా దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ ఖలీఫా ఏర్పడిన తరువాత, పాకిస్తాన్‌కు చెందిన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులతో చేతులు కలిపారు. వీరంతా కలిసి స్థానిక దళంగా ఏర్పడ్డారు. వీరంతా ఐసిస్ కేంద్రనాయకత్వానికి అనుగుణంగా పనిచేస్తుంటారు. వీరికే ఐసిస్ ఖరోసన్ అనే పేరు. అయితే, తాలిబన్లు జీహాదీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, అమెరికాతో కుమ్మక్కయ్యారని ఐసిస్ ఖరోసన్ ఆరోపిస్తున్నది. తాలిబన్లకు ఈ ఐసిస్ ఖరోసన్ పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. ఆఫ్ఘన్‌లో అమెరికా దళాలు ఎప్పుడైతే వెనక్కి వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నాయో అప్పటి నుంచే తాలిబన్లతో పాటు ఐసిస్ ఖరోసన్ కూడా బలపడింది. తన ఉనికిని, తన బలాన్ని చాటుకోవడానికి ఈ దాడులు చేసింది. ఆమెరికా బలగాల ఉపసంహరణ పూరైతే దేశంలో ఐసిస్ ఖరోసన్ మరింత బలపడే అవకాశం ఉన్నది. ఇది ఆఫ్ఘనిస్తాన్‌కు మాత్రమే కాదు అటు తాలిబన్లకు కూడా ఇబ్బందికరమైన అంశమే. మరి తాలిబన్లు వీరిని ఎలా దారిలోకి తీసుకొస్తారో చూడాలి. ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన దాడిలో 20 మంది తాలిబన్లు కూడా మరణించినట్టు తాలిబన్ సంస్థ ప్రకటించింది.
Read: ఆఫ్ఘన్‌లో ఆహార సంక్షోభం… ప్రతి ముగ్గురిలో ఒకరు…