ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను అమెరికా దళాలు పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిన తరువాత ఎయిర్‌పోర్ట్ మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. రాత్రి తాలిబన్ దళాలు ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించాయి. ఈ తరువాత తాలిబన్లు తయారు చేసిన బద్రి 313 ఫోర్స్ దళాలు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లి అనువణువును గాలించాయి. తాలిబన్ నేతలు కార్లలో వెళ్లి పరిశీలిస్తే, కొంతమంది మాత్రం ఎయిర్‌పోర్ట్‌లోకి సైకిళ్లపై వెళ్లారు. ట్రాక్‌పై రౌండ్లు వేశారు. దీనికి సంబందించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ…
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం తాలిబన్లు అధికారంలోకి వచ్చారు. ఆగస్టు 15 న తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. అయితే, తాలిబన్లు కాబూల్ నగరంలోకి అడుగుపెట్టకముందే అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశాన్ని వదలి వెళ్లిపోయాడు. ఘనీ దేశాన్ని విడిచి వెళ్తూ కోట్లాది రూపాయలను, ఖరీదైన కార్లను తన వెంట తీసుకెళ్లారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను ఘనీ ఖండించారు. అవన్నీ అవాస్తవాలని, కనీసం చెప్పులు తొడుక్కునే సమయం కూడా లేదని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఘనీ…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. 1996 నుంచి 2001 వరకు తాలిబన్ల దురాక్రమణలో ఆఫ్ఘనిస్తాన్ అతలాకుతలం అయింది. 2001 నుంచి 2021 వరకు ప్రజాస్వామ్య పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మరోసారి తాలిబన్ల వశం అయింది. దీంతో ఇప్పుడు మరలా తాలిబన్ల గురించి ప్రపంచం భయపడుతున్నది. ఆందోళన చెందుతున్నది. 1990లో తాలిబన్ల వ్యవస్థ ఏర్పాటైంది. గిరిజనుల హక్కుల పోరాటం కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు తాలిబన్ల వ్యవస్థను 1990లో ఏర్పాటు…
టైటానిక్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో చెప్పక్కర్లేదు. హీలీవుడ్ నిర్మాతలకు కాసుల పంట పండించింది. ఇక, ఆ సినిమా హీరో డికాప్రియో బీటిల్ కట్ హెయిర్ స్టైల్ అప్పట్లో యమా ఫేమస్ అయింది. టైటానిక్ సినిమా వచ్చిన సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన అమలులో ఉన్నది. అప్పట్లో ఆ హెయిర్‌స్టైల్‌ను యువత బాగా లైక్ చేసింది. చాలా మంది యూత్ ఆ హెయిర్‌స్టైల్ చేయించుకోవడానికి బార్బర్ షాపులకు క్యూలు కట్టారు. అయితే, తాలిబన్ల పాలనలో షరియా చట్టాల…
మూడు రోజుల క్రితం కాబూల్ ఎయిర్ పోర్ట్ బయట జరిగిన బాంబు దాడుల్లో 160 మందికి పైగా పౌరులు, 13 మంది అమెరికా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, ఈసారి రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక దేశాలు హెచ్చరించాయి. తమ దేశానికి చెందిన పౌరులు ఎవరూ కూడా ఎయిర్‌పోర్ట్ వైపు రావొద్దని అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ముందస్తుగా హెచ్చరించాయి.…
ఆఫ్ఘన్‌నిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులపై స్పందించిన అమెరికా.. ప్రతీకార దాడులు తప్పవని.. వారిని వెంటాడి వేటాడి చంపుతామని వార్నింగ్ ఇచ్చింది… ముందు ఉగ్రవాదుల బాంబుల మోత, వెనక తాలిబన్ల హెచ్చరిక. ఆఫ్ఘన్ దాటాలి అనుకునే వారికి ఆగస్టు 31 ఆఖరు తేది. ఇది వారి ప్రాణాలకు చివరితేదీగా మారింది. ఈ ఐదు రోజుల్లో దేశం దాటిన వాళ్లు ప్రాణాలతో ఉన్నట్టు. మిగిలి పోయిన వాళ్లు తాలిబన్ల చేతుల్లో చచ్చినట్టే. అప్ఘానిస్తాన్‌లో ఉన్నవారిలో ఇప్పుడు కనిపిస్తున్న భయం ఇదే. మిగిలిన…
ఆఫ్ఘనిస్థాన్‌లో వరుసగా బాంబు పేలుళ్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి… దేశ రాజధాని కాబూల్ సైతం తాలిబన్ల వశం అయిన తర్వాత ఈ పేలుళ్లు కలవరపెడుతున్నాయి.. దీంతో.. ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి ఏంటి? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ నేథప్యంలో.. భారత విదేశాంగశాఖ ఓ ప్రకటన చేసింది.. ఇప్పటి వరకు ఆఫ్ఘన్ నుంచి 550 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్టు వెల్లడించింది.. ఆరు ప్రత్యేక విమానాల ద్వారా 550 మందిని భారత్‌కు తరలించామని.. అందులో 260 మంది భారతీయులు…