గురువారం రోజున కాబూల్‌లో బాంబుపేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో శక్తివంతమైన ఐఈడీ బాంబులను పేల్చారు ఉగ్రవాదులు. ఈ దాడికోసం 11 కేజీల ఆర్డీఎక్స్‌ను వినియోగించారని తెలుస్తోంది. ఐఎస్ కె ఉగ్రవాదులు వినియోగించిన ఈ ఆర్డీఎక్స్ పాక్‌లోని పెషావర్, క్వెట్టా నగరాల నుంచి సరఫరా అయినట్టు తెలుస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అధునాత ఆయుధాలు, హెల్మెట్లు వంటివాటిని కూడా తునాతునకలు చేసేంతటి శక్తివంతమైన ఆర్డీఎక్స్ ను బాంబు తయారీలో వినియోగించారని ఆఫ్ఘన్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ తన నివేదికలో పేర్కొన్నది. ఆఫ్ఘన్ ప్రభుత్వంలో కలిసి పనిచేసిన వారితో పాటుగా ఐసిస్ ఉగ్రవాదులను ఈ సంస్థ ఇంటర్యూ చేసింది. ఇక ఐసిస్ కేలో 90 శాతం మంది పాకిస్తానీయులు, ఆఫ్ఘాన్లు ఉన్నట్టు నివేదకలో పేర్కొన్నారు. ఇక ఐసిస్ వినియోగిస్తున్న ఆయుధాలు పాక్‌లో తయారవుతున్నాయని, ఐసిస్ కు పాక్ అన్నిరకాలుగా అండగా ఉంటోందని నివేదక పేర్కొన్నది. పాక్ నుంచి ఆయుధాలను, ఆర్డీఎక్స్‌ను తలపాగాలోనూ, కూరగాయల బండ్ల ద్వారా పాక్ బోర్డర్ దాటించి ఆఫ్ఘనిస్తాన్‌లోకి చేరవేస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. మరి దీనిపై అగ్రదేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Read: ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు… రాత్రి 9 గంటల వరకు…