జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలులో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈరోజు ఒక్కరోజే 31 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారుల సమాచారం. భారత రాష్ట్ర సమితి (BRS) తరఫున పి. విష్ణు వర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన అభ్యర్థి తరపున నామినేషన్ వేసిన ఆయన, పార్టీ తరఫున అవసరమైన ఫార్మాలిటీలను పూర్తి చేశారు. మరోవైపు, ఇతర పార్టీల అభ్యర్థులు కూడా తమ నామినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.
Kantara: కాంతార 1లో రిషబ్ త్రిపాత్రాభినయం.. మూడో పాత్ర ఏమిటో తెలుసా?
బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఆయన భార్య హరిత నామినేషన్ దాఖలు చేశారు. దీపక్ రెడ్డి బీజేపీ తరఫున జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయనున్నారు. పార్టీ వర్గాలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. ఇప్పటి వరకు ఆరు రోజుల వ్యవధిలో మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఎక్కువ మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ సారి రేసులో ఉన్నారు. చివరి రెండు రోజుల్లో నామినేషన్ల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నామినేషన్‌ల స్వీకరణ ఈ నెల 21వ తేదీతో ముగియనుంది. రేపు (ఆదివారం) సెలవు, ఎల్లుండి (సోమవారం) దీపావళి పండుగ కారణంగా.. మంగళవారం రోజే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసే చివరి అవకాశం. ఈ నేపథ్యంలో చివరి రోజు భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆసక్తి పెరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం వ్యూహాలను ముమ్మరం చేస్తున్నాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య అధికం కావడంతో పోటీ ఆసక్తికరంగా మారనుంది.
Diwali: శతాబ్ధాల నాటి ‘‘సతీ’’ శాపం.. ఈ గ్రామ ప్రజలు ‘‘దీపావళి’’కి దూరం..