Exit polls: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ప్రకటించారు. నవంబర్ 6 ఉదయం 7 గంటల నుండి నవంబర్ 11 సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌కి సంబంధిత సమాచారం, సర్వేలు, లేదా ఫలితాలను న్యూస్ చానెల్స్, రేడియో, వార్తాపత్రికలు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచురించరాదని ఆయన స్పష్టం చేశారు.
దీపావళికి ఆఫర్లే.. ఆఫర్లు.. Hyundai, Tata, Maruti Suzuki, Kia కార్లపై ఎంత డిస్కౌంట్ లభించనుందంటే..?
ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై ప్రజాప్రతినిధుల చట్టం, 1951 లోని 126A సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చని హెచ్చరించారు. అలాగే 126(1)(b) సెక్షన్ ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల సంబంధిత సర్వేలు, అభిప్రాయ సేకరణ ఫలితాలు ఎలక్ట్రానిక్ లేదా ఇతర మాధ్యమాల్లో ప్రచురించరాదని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా వినియోగదారులు, ఎన్నికల సంబంధిత అన్ని వర్గాలకు జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ సూచించారు.
IND vs PAK: షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న భారత్-పాకిస్థాన్ ప్లేయర్లు.. ఫోటో వైరల్!