CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ వస్తే.. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో బీజేపీ గెలిచినట్టే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: 2034 జూన్ వరకు తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేను కాంగ్రెస్ కార్యకర్తను.. ఏ ఎన్నిక వచ్చిన కోట్లాడత.. నాది లీడర్ మనస్తత్వం కాదు.. క్యాడర్ మనస్తత్వం అన్నారు. డోర్ టు డోర్ కూడా తిరుగుతానని స్పష్టం చేశారు. సెక్యూరిటీ అనుమతి ఇవ్వడం లేదు కానీ.. ఇస్తే ఇల్లు ఇల్లు తిరుగుతానన్నారు. నాకు ఓపిక.. వయసు ఉందని చెప్పారు. అనంతరం సీఎం రేవంత్ బీజేపీ నాయకులపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీలైన ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మీద కోపంతో ఉన్న నాయకులను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారానికి పిలవలేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఎందుకు ప్రచారానికి పిలవలేదు. చివరి క్షణంలో ఎందుకు పిలిచారని నిలదీశారు. చిన్ని చిన్న ఎన్నికల ప్రచారానికి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులైన యోగి ఆధిత్యానాథ్, హిమంత్, రేఖా గుప్తను తీసుకొచ్చే మీరు.. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
READ MORE: IPL 2026-CSK: ఐపీఎల్ 2026 వేలంకు ముందే సంచలనం.. సీఎస్‌కేలోకి సంజు, జడేజా ఔట్!
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
బీజేపీ బీఆర్ఎస్‌కు సపోర్టు చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. “ఎందుకు కిషన్‌రెడ్డి కాళ్లేశ్వరం అవినీతి మీద మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ ఫార్ములా ఈ రేస్‌మీద ఎందుకు మాట్లాడటం లేదు. బీజేపీది హిందూ ఎజెండా కదా.. సెక్రటేరియట్‌లో అమ్మవారి గుడిని కూలగొట్టి తరలించారు. ఈ అంశంపై ఎందుకు ప్రశ్నించలేదు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన దేవత గుడిని కూలగొడితే ఎందుకు మాట్లాడలేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సినిమా ఇంటర్వేల్‌కి కూడా రాలేదు. కానీ.. ఈ సినిమా ఎటు పోతుందో మనకు అర్థమవుతోంది. హిందువులంతా తమకు ఓటేయమని బండి సంజయ్ అన్నారు. డి పాజిట్ పోతే హిందువులు బీజేపీతో లేరని వాళ్లు ఒప్పుకున్నట్లే కదా..? ఇప్పుడు డిపాజిట్ వస్తే.. ఈ దేశంతో పాటు పక్కదేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో కూడా బీజేపీ గెలిచినట్లే. జూబ్లీహిల్స్‌లో ఎలాగైనా డిపాజిట్లు తెచ్చుకోండి.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!