కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేవ్ తగ్గడంతో మరికొద్ది రోజుల్లోనే షూటింగ్స్ పునప్రారంభం కానున్నాయి. కాగా సినీ అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇంకా క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు కీలక యాక్షన్ సీన్ల చిత్రీకరించాల్సి ఉందట, దీనికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. దీంతో…
జూనియర్ ఎన్టీఆర్.. పొలిటికల్ ఎంట్రీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎప్పుడు ఎన్టీఆర్… రాజకీయాల్లోకి ఆరగేట్రం చేస్తారని టిడిపి నేతలు, ఇటు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్… పొలిటికల్ ఎంట్రీపై ఏ రోజు సరిగా స్పందించిన దకళాలు లేవు. కానీ ఏపీలో అక్కడక్కడ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ పోస్టర్లు, బ్యానర్లు వెలుగుచూశాయి. 2024 లోపైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని ఆసక్తితో ఉన్నారు. అయితే తాజాగా.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ నూతన…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన వీరిద్దరు.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేర్లు చేయడానికి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తిచేసుకొనే పనిలో పడ్డారు. త్వరలోనే కొరటాల-ఎన్టీఆర్ మూవీ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్లో సినిమా ఉంటుందని కొరటాల గ్యారెంటీ ఇస్తున్నారు.…
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ హోస్ట్ గా “ఎవరు మీలో కోటీశ్వరులు” రియాలిటీ షోను గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. లెక్క ప్రకారం ఈ షో మే నెల చివరి వారం నుంచి టెలికాస్ట్ కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా వచ్చిపడిన కరోనా సెకండ్…
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ ను వరల్డ్ వైడ్ గా పంపిణీ చేసే విషయంలో ఎవరెవరి పాత్ర ఏమిటనే విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. దక్షిణాది భాషల థియేట్రికల్ రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు ఇంకా గోప్యత పాటిస్తున్నా, ఈ సినిమాను హిందీలో పంపిణీ చేస్తున్న పెన్ స్టూడియోస్, పెన్ మరుధర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ మాత్రం ఓ స్పష్టతను ఇచ్చేశాయి. పాన్ ఇండియా…
నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పండగ చేసుకునే అంతగా ఆయన సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఎన్టీఆర్ దెబ్బకి ఇండస్ట్రీలో ఏ దర్శకుడు కూడా మిగలలేదు అనేంతగా అప్డేట్స్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ కి కూడా ఎన్టీఆర్ తదుపరి సినిమాలపై ఓ క్లారిటీ వచ్చింది. కాగా ఎన్టీఆర్ సినిమాల లిస్ట్ చూస్తే 2024 వరకు బిజీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తిచేయనున్నాడు. కరోనా…
జనానికి ‘జూనియర్ యన్టీఆర్’… అభిమానులకు ‘యంగ్ టైగర్’… సన్నిహితులకు ‘తారక్’… వెరసి ‘బుల్లి రామయ్య’ – అతనంటే తెలుగువారందరికీ అభిమానమే! నందమూరి నటవంశం మూడో తరం హీరోల్లో ఎందరున్నా, జూనియర్ యన్టీఆర్ దే పైచేయి. తాత తారకరాముని పేరు పెట్టుకొని, ఆ నామానికి ఉన్న గౌరవాన్ని నిలుపుతూ చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తున్నాడు తారక్. తండ్రి హరికృష్ణ పౌరుషాన్ని నింపుకొని అభిమానుల మదిలో యంగ్ టైగర్ గా నిలిచాడు. నవతరం కథానాయకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ…
మన స్టార్ హీరోలు తమ తదుపరి సినిమాలను కమిట్ అయ్యే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కరోనా తర్వాత ఎక్కువ శాతం మంది పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెంచుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ సినిమా చేయబోతున్నాడు. అంతే కాదు ఆ తర్వాత కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా స్థాయి సినిమా కమిట్…
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కలయికలో రానున్న సినిమా కావటంతో అభిమానుల్లో హడావుడి ఎక్కువగానే ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జతగా కియారా అద్వానీ నటించబోతోందట. కొరటాల ‘భరత్ అనే నేను’లో మహేష్ బాబు కు జోడిగా కియారా నటించింది. మరోసారి కొరటాల దృష్టి ఆమెపైనే ఉందట.…
కరోనా పాజిటీవ్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు నందమూరి తారకరామారావు. ఈ రోజు ఎన్టీఆర్ ను ఫోన్ లో పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. ‘కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తను తన ఫ్యామిలీ మొత్తం బాగుంది. తారక్ ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉన్నారని తెలుసుకుని సంతోషిస్తున్నాను. త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. చిరంజీవి తమ హీరోని…