యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోతో తెలుగు ప్రేక్షకాభిమానులను తనదైన స్టైల్‌లో ఎంటర్‌టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఎపిసోడ్‌కి సినీ సెలెబ్రిటీలు కూడా రావడంతో టీఆర్పీ రేటింగ్ లోను దూసుకుపోతోంది. ఇదివరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి వచ్చి ఎంటెర్టైన్మెంట్ చేయగా.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు షోలో కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
దసరా స్పెషల్‌గా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చెయ్యబోతున్నారు. నేడు దీనికి సంబంధించిన షూటింగ్‌లో మహేష్ పాల్గొనబోతున్నారని సమాచారం. పండుగ రోజు ఇద్దరు హీరోలు కలిసి బుల్లితెర మీద సందడి చెయ్యనుండడంతో ఈ స్పెషల్ ఎపిసోడ్‌పై హైప్ క్రియేట్ అయింది. ఇంతకుముందు మహేష్ ‘భరత్ అనే నేను’ ఫంక్షన్‌కి తారక్ గెస్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే.