యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా హోస్ట్ గానూ మారి బుల్లితెర వీక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన “ఎవరు మీలో కోటీశ్వరులు” అనే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే షోకు వస్తున్న టీఆర్పీ రేటింగ్ మాత్రం మిగతా రియాలిటీ షోలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో షో రేటింగ్ ను పెంచడానికి, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. “ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రారంభమై మూడు నాలుగు వారాలవుతోంది. కర్టన్‌రైజర్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ కన్పించినప్పటి ఆ రేటింగ్ కూడా పెద్దగా లేదు.
Read Also : క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానికి ప్రభాస్ సర్ప్రైజ్
షో నిర్వాహకులు పాపులారిటీని పెంచడానికి సెలబ్రిటీలతో ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, కొరటాల శివ ఈ షోకు హాజరయ్యారు. తాజాగా ఈ షోకు సూపర్‌స్టార్ మహేష్ బాబు హాజరవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. టెలికాస్ట్ తేదీని ఇంకా నిర్ణయించలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులలో మహేష్ బాబుకు ఉన్న ప్రజాదరణతో ఎపిసోడ్‌కు అసాధారణమైన రేటింగ్‌లు వచ్చే అవకాశం ఉందని షోను ప్రసారం చేస్తున్న టీవీ 7యాజమాన్యం భావిస్తోందట. ఇక ఎన్టీఆర్, మహేష్ బాబు మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.