జనానికి ‘జూనియర్ యన్టీఆర్’… అభిమానులకు ‘యంగ్ టైగర్’… సన్నిహితులకు ‘తారక్’… వెరసి ‘బుల్లి రామయ్య’ – అతనంటే తెలుగువారందరికీ అభిమానమే! నందమూరి నటవంశం మూడో తరం హీరోల్లో ఎందరున్నా, జూనియర్ యన్టీఆర్ దే పైచేయి. తాత తారకరాముని పేరు పెట్టుకొని, ఆ నామానికి ఉన్న గౌరవాన్ని నిలుపుతూ చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తున్నాడు తారక్. తండ్రి హరికృష్ణ పౌరుషాన్ని నింపుకొని అభిమానుల మదిలో యంగ్ టైగర్ గా నిలిచాడు. నవతరం కథానాయకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ…
మన స్టార్ హీరోలు తమ తదుపరి సినిమాలను కమిట్ అయ్యే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కరోనా తర్వాత ఎక్కువ శాతం మంది పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెంచుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ సినిమా చేయబోతున్నాడు. అంతే కాదు ఆ తర్వాత కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా స్థాయి సినిమా కమిట్…
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కలయికలో రానున్న సినిమా కావటంతో అభిమానుల్లో హడావుడి ఎక్కువగానే ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జతగా కియారా అద్వానీ నటించబోతోందట. కొరటాల ‘భరత్ అనే నేను’లో మహేష్ బాబు కు జోడిగా కియారా నటించింది. మరోసారి కొరటాల దృష్టి ఆమెపైనే ఉందట.…
కరోనా పాజిటీవ్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు నందమూరి తారకరామారావు. ఈ రోజు ఎన్టీఆర్ ను ఫోన్ లో పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. ‘కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తను తన ఫ్యామిలీ మొత్తం బాగుంది. తారక్ ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉన్నారని తెలుసుకుని సంతోషిస్తున్నాను. త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. చిరంజీవి తమ హీరోని…
టాలీవుడ్ చాలా సినిమాలు కరోనాతో ఇబ్బందులు పడుతున్నాయి. తొలి దశ కరోనా తర్వాత కొన్ని సినిమాలకు ఆదరణ లభించిన.. కరోనా సెకండ్ వేవ్ తో మాత్రం విడుదలకు రెడీగా వున్నా సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఈ నెలలోనే విడుదల కావల్సిన ‘లవ్స్టోరి’, ‘టక్ జగదీష్’, ‘విరాటపర్వం’ సినిమాలు వాయిదా పడగా.. రీసెంట్ గా ఆచార్య, నారప్ప సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. సాధారణ పరిస్థితులు వచ్చాక మళ్ళీ సినిమాల జోరు కనిపించనుంది. అయితే ఎంతగానో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న…
రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొమురం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన కొమురం భీమ్ టీజర్ టాలీవుడ్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి, అక్టోబర్ 22న విడుదలైన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ యూట్యూబ్ లో ఇప్పటి వరకు 50…
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీం పాత్రలో అలరించనున్నాడు. అంతేకాదు ఎన్టీఆర్ తెలంగాణ యాసలో ఇరగదీయనున్నాడట. ఈ సినిమాను రాజమౌళి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్కు ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దర్శకుడు కొరటాలతో సినిమా చేయనున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సినిమా…
యంగ్ టైగర్ ఎన్టీయార్ కొత్త సినిమాకు సంబంధించిన సర్ ప్రైజ్ న్యూస్ అధికారికంగా వెలువడింది. ఎన్టీయార్ 30వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు. ఎన్టీయార్ తో ఐదేళ్ళ క్రితం కొరటాల శివ తీసిన “జనతా గ్యారేజ్’ ఘన విజయాన్ని సాధించింది. దాంతో ఇప్పుడీ సినిమాకు సూపర్ క్రేజ్ రాబోతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని నిర్మించే ఈ సినిమా వచ్చే యేడాది వేసవి కానుకగా ఏప్రిల్ 29న విడుదల కానుంది. సినిమా…