CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
- తుమ్మిడిహెట్టి అంశంపై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ
- ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ఫోకస్
- బ్యారేజ్ ఎత్తు పెంపుతో లక్షల ఎకరాలకు సాగునీరు?
- గ్రావిటీ ద్వారా నీటి తరలింపుపై తెలంగాణ లెక్కలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ‘తుమ్మిడిహెట్టి బ్యారేజ్’ నిర్మాణం , దాని ఎత్తుపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారికంగా ఒక లేఖ రాశారు. ఈ బ్యారేజ్ అంశంపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రతినిధుల బృందంతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అందుకు అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని రేవంత్ రెడ్డి ఆ లేఖలో కోరారు.
గతంలో (2016 ఆగస్టు 23న) జరిగిన అంతర్రాష్ట్ర బోర్డు (Inter-State Board) సమావేశంలో తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో (FRL) బ్యారేజ్ నిర్మించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అవసరమైన అన్ని అనుమతులకు సహకరిస్తామని కూడా అప్పట్లో తెలిపింది. అయితే, నిలిచిపోయిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలని సంకల్పించిన రేవంత్ సర్కార్.. ఇటీవల ఈ ప్రాజెక్టుపై సమగ్రంగా పునఃసమీక్ష నిర్వహించింది.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ఎత్తు పెంచితేనే తెలంగాణకు ప్రయోజనం.. ముంపు చాలా తక్కువ!
ఇంజనీరింగ్ నిపుణుల సూచనల ప్రకారం.. 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల నీటి అవసరాలను పూర్తిగా తీర్చడం సాధ్యం కాదని రేవంత్ సర్కార్ ఒక అంచనాకు వచ్చింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పరిధిలోని లక్షలాది ఎకరాల సాగునీటి అవసరాలను, ప్రజల తాగునీటి గోసను తీర్చాలంటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్రతో మరోసారి చర్చలు జరపడం అనివార్యమని సీఎం రేవంత్ రెడ్డి తన లేఖలో స్పష్టం చేశారు.
ఒకవేళ బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల కంటే కాస్త పెంచినప్పటికీ, మహారాష్ట్ర వైపు జరిగే ముంపు ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని రేవంత్ రెడ్డి ఆ లేఖలో సాంకేతికంగా వివరించారు. ఎఫ్ఆర్ఎల్ (FRL) ఎత్తును పెంచడం ద్వారా అదనపు పంపింగ్ ఖర్చులు లేకుండా, కేవలం గ్రావిటీ (సహజ ప్రవాహం) ద్వారానే తెలంగాణలోని బీడు భూములకు సులభంగా నీటిని తరలించే వీలుంటుందని సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!