అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైకిల్‌పై నుంచి కింద పడ్డారు. అయితే వెంటనే పైకి లేచిన ఆయన తాను బాగానే ఉన్నట్లు తెలిపారు. కాగా, బైడెన్‌కు ఎలాంటి దెబ్బలు తగలలేదని వైట్‌హౌస్ పేర్కొంది. జో బైడెన్ తన భార్య జిల్ బైడెన్‌తో కలిసి డెలావేర్‌లోని తమ ఇంటికి సమీపంలోని రెహోబోత్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే అధ్యక్షుడు బైడెన్ శనివారం సైకిల్ పై సరదాగా రైడింగ్‌కి వెళ్లారు. అనుకోకుండా హఠాత్తుగా సైకిల్ మీద నుంచి దిగుతూ బ్యాలెన్స్…
భారత్, ఇజ్రాయిల్, యూఎస్ఏ, యూఏఈ దేశాల కూటమి ఐ2యూ2 తొలి శిఖరాగ్ర సమావేశాలను యూఎస్ఏ నిర్వహించనుంది. ఈ భేటీ నాలుగు దేశాల అధ్యక్షులు పాల్గొననున్నారు. ఐ2యూ2 ఏర్పడిన తర్వాత జరగబోయే తొలి శిఖరాగ్ర సమావేశం ఇదే. ఇండియా, ఇజ్రాయిల్ దేశాల మొదటి అక్షరాలను కలిపి ఐ 2గా, యూఎస్ఏ, యూఏఈని కలిపి యూ 2 గా వ్యవహరిస్తారు. ఈ గ్రూప్ ను పశ్చిమాసియా క్వాడ్ గా కూడా అభివర్ణిస్తారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇజ్రాయిల్ ప్రధాని నఫ్తాలీ…
రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి.. అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధ సాయాన్ని ఉక్రెయిన్ కోరుతోంది. అయితే, అమెరికా మొదట్లో మౌనం పాటించింది. వరుసగా నిషేధాలు విధిస్తూ.. రష్యాని దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తూ వస్తోందే తప్ప, ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందించే విషయంపై మాత్రం ఎలాంటి కదిలికలు చేపట్టలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్ళ తర్వాత ఆయుధ సాయం అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది. స్వయంగా అధ్యక్షుడు జో బైడెన్ ఈ కీలక ప్రకటన చేశాడు. కానీ.. రష్యా భూభాగంపై ఆ…
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. అలాగని ఇది పూర్తిగా కనుమరుగవ్వలేదు. ఇంకా కొన్ని దేశాల్లో దీని ఉధృతి కొనసాగుతోంది. కాకపోతే, పరిస్థితి మునుపటిలా మరీ తీవ్రంగా అయితే లేదు. ఇంతలో మంకీపాక్స్ వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పలు దేశాల్లో ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యాప్తి కూడా వేగంగా జరుగుతోంది. దీంతో, ఇది మరో కరోనా మహమ్మారి కానుందా? భారీ స్థాయిలో మరణాలు సంభవిస్తాయా? లాక్డౌన్ లాంటి పరిస్థితులు వస్తాయా? అనే…
భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. క్వాడ్ సమ్మిట్ లో పాల్గొనేందుకు జపాన్ టోక్యో వెళ్లిన మోదీ వరసగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల దేశాధినేతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా క్వాడ్ సమ్మిట్ ముగిసిన తర్వాత మోదీ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో సమావేశం అయ్యాయి. భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం పరస్పర విశ్వాస భాగస్వామ్యం అని మోదీ అన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యం నమ్మకంతో కూడిందని ఆయన అన్నారు. ఇరు…
తక్కువ సయమంలోనే క్వాడ్ కూటమి ప్రపంచంలో తనకంటూ ఒక ముఖ్య స్థానాన్ని సంపాదించుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం టోక్యోలో జరిగిన క్వాడ్ సమ్మిట్ లో జపాన్ ప్రధాని కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, అమెరికా అధ్యక్షడు జో బైడెన్ తో సమావేశం అయ్యారు మోదీ. ఇండో పసిఫిక్ రిజియన్ భద్రతపై నాలుగు దేశాధినేతలు చర్చించారు. క్వాడ్ పరిధివిస్తృతమైందని మోదీ అన్నారు. పరస్పర విశ్వాసం, మా సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహాన్ని…
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయి దాదాపుగా నాలుగో నెలకు చేరింది. ఇరు దేశాలు కూడా వెనక్కి తగ్గడం లేదు. రష్యా బలగాలకు ధీటుగా ఉక్రెయిన్ నిలబడుతోంది. రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన తర్వాత నుంచి అమెరికా, నాటో దేశాలు ఆర్థికంగా, సైనికంగా సహాయపడుతున్నాయి. రష్యాను ధీటుగా ఎదుర్కొనేందు స్ట్రింగర్ మిసైళ్లు, ఇతర ఆయుధాలను, కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు సైనిక వ్యూహాలను అందిస్తున్నాయి అమెరికా, నాటో దేశాలు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ కు 40 బిలియన్…
ఉక్రెయిన్‌పై సరిగ్గా నెల కిందట యుద్ధాన్ని ప్రారంభించింది రష్యా. ఫిబ్రవరి 24న రష్యా బలగాలు క్రిమియా సరిహద్దులు దాటి ఉక్రెయిన్‌లోకి వెళ్లాయి. అప్పుడు మొదలైన దాడులు నేటికీ రేయింబవళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్ నామరూపాల్లేకుండా పోయింది. కొన్ని నగరాలు పూర్తిగా నిర్మానుష్యం అయిపోయాయి. 35 లక్షల మంది ఉక్రెయిన్ వీడి పొరుగు దేశాలు వలసపోయారు. అత్యధికంగా పోలాండ్‌లో 20 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ దాటి వెళ్లడానికి చూడా ఆస్కారం లేని…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు బైడెన్.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్‌లో బిజినెస్ లీడర్ల సమావేశంలో మాట్లాడిన బైడెన్.. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాల తరహాలో భారత్.. రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయలేకపోతోందని, వణుకుతోందని అన్నారు. రష్యా వ్యతిరేక కూటమిలో భారత్‌ను మినహాయించినట్టేనని పేర్కొన్నారు. స్థిరమైన నిర్ణయాలు, అభిప్రాయాలు భారత్‌లో కనిపించట్లేదని చెప్పారు. క్వాడ్‌లో సభ్యత్వం…
ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగడంపై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా అన్యాయంగా దాడి చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌లో జరిగే పరిణామాలకు రష్యా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని రష్యా ఉల్లంఘించిందని.. రష్యా సైనిక చర్యను ఆపాలని, బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని ఆయన పేర్కొన్నారు. రష్యా దాడులకు ప్రతి చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.…