Modi-Biden: యూఎస్ ఇండియా మధ్య ద్వైపాక్షిక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. క్వాడ్ సమ్మిట్ లో పాల్గొనేందుకు జపాన్ టోక్యో వెళ్లిన మోదీ వరసగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల దేశాధినేతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా క్వాడ్ సమ్మిట్ ముగిసిన తర్వాత మోదీ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో సమావేశం అయ్యాయి. భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం పరస్పర విశ్వాస భాగస్వామ్యం అని మోదీ అన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యం నమ్మకంతో కూడిందని ఆయన అన్నారు.
ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ తో పాటు ఇరు దేశాల అధికారులు పాల్గొన్నారు. చర్చల సమయంలో ఉక్రెయిన్, రష్యా యుద్ధ పరిణామాలపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడంతో చైనా విఫలం అయిందని.. అదే సమయంలో భారత్ విజయం సాధించిందని జో బైడెన్ కొనియాడారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఇండియా కోవిడ్ ను కంట్రోల్ చేసిందని ఆయన అన్నారు. మోదీ విజయం ప్రజాస్వామ్య దేశాల్లో నమ్మకం నింపిందని.. చైనా, రష్యా వంటి నిరంకుశ ప్రభుత్వాలు మెరుగైన పాలనను అందిస్తాయనే అపోహాను చేధించాయి అని అన్నారు.
Also Read
- China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
- Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
- Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
తాజాగా క్వాడ్ లీడర్ల మధ్య ఇది నాలుగో భేటీ. గతేడాది సెప్టెంబర్ లో అమెరికా వాషింగ్టన్ వేదికగా సమావేశాలు జరిగాయి. క్వాడ్ సమ్మిట్ లో ప్రధానంగా నేతలంతా ఇండో-పసిఫిక్ రీజియన్ లో శాంతి, భద్రత, వాణిజ్యం, వ్యాపారం గురించి చర్చించారు. అంతరిక్షం, వాతావరణ మార్పు, ఆరోగ్యం, సైబర్ భద్రత వంటి అంశాల్లో దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్ లో చైనా చేస్తున్న దురాక్రమణను సమర్థంగా ఎదుర్కొనేందుకు జపాన్, ఆస్ట్రేలియా,ఇండియా, యూఎస్ఏ లు కలిసి క్వాడ్ పేరిట కూటమిని ఏర్పాటు చేశాయి.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!