భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయన్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు దేశాలకు లాభదాయకమన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీతో.. వైట్‌హౌజ్‌లో సమావేశమైన బైడెన్.. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు. బైడెన్‌తో భేటీ వల్ల అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశం లభించిందన్నారు ప్రధాని మోడీ. ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే…
ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. వచ్చేవారంలో ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లనున్నారు. క్వాడ్ దేశాల సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో సమావేశం కానున్నారు. అనంతరం మోడి సెప్టెంబర్ 25 వ తేదీన ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. రెండు రోజులపాటు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నట్టు పీఎంవో కార్యాలయం తెలియజేసింది. ఈనెల 24 వ తేదీన క్వాడ్ దేశాల సదస్సు జరగనున్నది. ఇండియా, అమెరికా, జపాన్, అస్ట్రేలియా దేశాలు క్వాడ్…
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. కరోనా, తీవ్రవాదంపై ప్రధాని ప్రసంగించడంతోపాటు ఆప్ఘనిస్థాన్‌పై భారత వైఖరిని ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వం గురించి చర్చించనున్నట్టు సమాచారం. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జోబైడన్‌తో మోడీ భేటీ అవుతారని సమాచారం. కరోనా కారణంగా విదేశీ పర్యటనలకు దూరమయ్యారు మోడీ.. ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్ లో పర్యటన మినహా ఆయన ఏ…
అమెరికా సేనలు వైదొలిగిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశం అయింది. అమెరికా వెచ్చించిన లక్షల కోట్ల డాలర్లు బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఆఫ్ఘన్ సైనికులు తాలిబన్లను సమర్థవంతంగా అడ్డుకుంటారని అందరూ అనుకున్నారు. కాని, వారు చేతులెత్తేయడంతో తక్కువ రోజుల్లోనే తాలిబన్లు కాబూల్‌ను చేరుకోవడం, కొన్ని తప్పుడు వార్తల ద్వారా ఘనీ ఆగమేఘాలమీద దేశాన్ని విడిచి వెళ్లడం జరిగింది. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లడానికి కొన్ని రోజుల ముందు చివరి సారిగా బైడెన్‌తో…
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ సహా చాలా ప్రాంతాలు తాలిబన్ల వశం అయిన తర్వాత కూడా హింస సాగుతోంది.. వరుసగా బాంబు పేలుళ్లు కాబూల్ వాసులను వణికిస్తున్నాయి.. ఇప్పటికే కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఐసిస్ జరిపిన దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 180 దాటిపోగా.. మరోసారి కాబూల్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది అమెరికా.. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద వచ్చే 36 గంటల్లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రాగల 24…
ఆఫ్ఘన్‌నిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులపై స్పందించిన అమెరికా.. ప్రతీకార దాడులు తప్పవని.. వారిని వెంటాడి వేటాడి చంపుతామని వార్నింగ్ ఇచ్చింది… ముందు ఉగ్రవాదుల బాంబుల మోత, వెనక తాలిబన్ల హెచ్చరిక. ఆఫ్ఘన్ దాటాలి అనుకునే వారికి ఆగస్టు 31 ఆఖరు తేది. ఇది వారి ప్రాణాలకు చివరితేదీగా మారింది. ఈ ఐదు రోజుల్లో దేశం దాటిన వాళ్లు ప్రాణాలతో ఉన్నట్టు. మిగిలి పోయిన వాళ్లు తాలిబన్ల చేతుల్లో చచ్చినట్టే. అప్ఘానిస్తాన్‌లో ఉన్నవారిలో ఇప్పుడు కనిపిస్తున్న భయం ఇదే. మిగిలిన…
అంతా అనుకున్నట్టుగానే జరిగింది. ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా అగ్రరాజ్యాల నిఘావ్యవస్థలు హెచ్చరించిన కొద్దిసేపటికే కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 72 మంది మృతి చెందగా, 140 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తామే కారణమని ఇప్పటికే ఐసిస్ ప్రకటించింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డవారి ఫొటోలను కూడా ఐసిస్ రిలీజ్ చేసింది. కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దాడులు జరిగిన కాసేపటి తరువాత సెంట్రల్ కాబూల్‌లో మరోపేలుడు సంభవించినట్టు సమాచారం.…
తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ నటులలో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. ఆయన సోషల్ మీడియాలో చురుకుగా ఉంటాడు. అందులో వివిధ సమస్యలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తాడు. నిఖిల్ జాతీయ రాజకీయాలను, అంతర్జాతీయ రాజకీయాలను బాగా ఫాలో చేస్తాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తే విషయం స్పష్టమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితులపై నిఖిల్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. యుఎస్ఎ ప్రభుత్వం తమ దళాలను తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్న వెంటనే, తాలిబాన్ దళాలు ఆఫ్ఘనిస్తాన్‌ను…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో దళాలు తప్పుకోవడంతో ఆ దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సెప్టెంబర్ 11 వరకు పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా, ఆ ప్రక్రియను అమెరికా వేగవంతం చేయడంతో తాలిబన్లు దురాక్రమణకు పాల్పడ్డాయి. వేగంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నాయి. ఆదివారంరోజున రాజధాని కాబూల్ నగరంలోకి ప్రవేశించడంతో ఆఫ్ఘన్ తాలిబన్ల వశం అయింది. ఈ పరిస్థితికి అమెరికానే కారణం అని ప్రపంచం మొత్తం విమర్శలు చేస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్…
అమెరికా-పాక్ దేశాల మధ్య మంచి మైత్రి ఉన్నది. అయితే, ఈ మైత్రి గత కొంతకాలంగా సజావుగా ఉండటంలేదు. పాక్‌లో ఉగ్రవాదం పెరిగిపోవడంతో పాటుగా, ఆ దేశం చైనాతో బలమైన సంబందాలు కలిగి ఉండటం వలన అమెరికా పాక్ కు దూరమైందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రెండు దశాబ్దాల కాలం క్రితం అమెరికా దళాలు అఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టి తాలిబన్, ఆల్‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థలపై విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో పాక్ సహకారంలో అమెరికా తాలిబన్‌ల ఆటకట్టించింది. ప్రస్తుతం అమెరికా-పాక్…