తక్కువ సయమంలోనే క్వాడ్ కూటమి ప్రపంచంలో తనకంటూ ఒక ముఖ్య స్థానాన్ని సంపాదించుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం టోక్యోలో జరిగిన క్వాడ్ సమ్మిట్ లో జపాన్ ప్రధాని కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, అమెరికా అధ్యక్షడు జో బైడెన్ తో సమావేశం అయ్యారు మోదీ. ఇండో పసిఫిక్ రిజియన్ భద్రతపై నాలుగు దేశాధినేతలు చర్చించారు. క్వాడ్ పరిధివిస్తృతమైందని మోదీ అన్నారు. పరస్పర విశ్వాసం, మా సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయని ఆయన వెల్లడించారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఫ్రీ, ఓపెన్ ట్రేడ్ ను భారత్ కోరుకుంటుందని… ఇది మనందరి లక్ష్యం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్తగా ఎన్నికైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ కు శుభాకాంక్షలు తెలిపారు. గెలిచిన కొన్ని గంటల్లోనే మీరు మా మధ్య ఉండటం సంతోషకరం అని మోదీ అన్నారు. కోవిడ్ తీవ్ర పరిస్థితుల మధ్య వ్యాక్సిన్ డెలవరీ, క్లైమెట్ యాక్షన్, డిజాస్టర్ రెస్పాన్స్, ఆర్థిక రంగాల్లో సమన్వయం చేసుకున్నామని.. ఇండో పసిఫిక్ రిజియన్ లో శాంతి, స్థిరత కోసం నిర్మాణాత్మక ఎజెండాతో ముందుకు వెళ్తున్నామని మోదీ తెలిపారు.
జపాన్ పర్యటనలో ఉన్న మోదీ క్వాడ్ సమావేశం అనంతరం ప్రధాని కిషిడా, అల్బనీస్, ప్రెసిడెంట్ జో బైడెన్ తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని క్వాడ్ కేంద్రంగా లేవనెత్తారు. రష్యా, పుతిన్ సంస్కృతిని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు” అని అన్నారు. రష్యా యుద్ధం కొనసాగిస్తున్నంత వరకు అమెరికా తమ మిత్రదేశాలతో కలిసి పనిచేస్తూనే ఉంటుందని వెల్లడించారు. ఇండో పసిఫిక్ రీజియన్ ను శాంతియుత్తంగా ఉంచడానికి క్వాడ్ కు చాలా పని ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండో పసిఫిక్ లో అమెరికా బలమైన, స్థిరమైన భాగస్వామిగా ఉంటుందని జో బైడెన్ అన్నారు.