పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని నటి, బీజేపీ నాయకురాలు జీవితా రాజశేఖర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో తన భర్త రాజశేఖర్‌తో కలిసి పాల్గొన్న ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
నటి, నిర్మాత జీవిత రాజశేఖర్- గరుడ వేగా సినిమా నిర్మాతల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఇద్దరు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు.నిన్నటికి నిన్న జీవితా.. ‘శేఖర్’ సినిమా ప్రెస్ మీట్ లో గరుడవేగ సినిమా వివాదం కోర్టులో ఉందని, కోర్టులో తేలకముందే కొందరు ఏదేదో చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. నా కూతురు లేచిపోయింది కొందరు, మేము మోసం చేశామని మరికొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి అలాంటివి చేయకండి.. మా…
యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ ఇప్పుడు యాంగ్రీ స్టార్ గా మారారు. ఆయన హీరోగా నటించిన ‘శేఖర్’ చిత్రాన్ని జీవిత దర్శకత్వంలో శివానీ, శివాత్మిక, బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాసరావు, వంకాయలపాటి మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో రాజశేఖర్ తో పాటు ఆయన పెద్ద కూతురు శివానీ కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ నెల 20న సినిమా విడుదల కాబోతున్న నేపధ్యంలో మూవీ ట్రైలర్ ను గురువారం ఏఎంబీలో విడుదల చేశారు.…
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శేఖర్’. పెగాససన్ సినీ కార్ప్ తౌరుర్ సినీ కార్ప్ సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ త్రిపుర క్రియేషన్స్ బ్యానర్ లపై భీరం సుధాకర్ రెడ్డి శివానీ రాజశేఖర్ శివాత్మిక రాజశేఖర్ వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ కీలక పాత్రలో…
ప్రస్తుతం టాలీవుడ్ లో జీవితా రాజశేఖర్ చీటింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. ‘గరుడ వేగ’ నిర్మాత, జ్యో స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత కోటేశ్వర రాజు జీవితా పై చీటింగ్ కేసు పెట్టిన విషయం విదితమే. తమ వద్ద రూ. 26 కోట్ల అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు ఆయన తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ కేసుపై జీవిత స్పందిస్తూ.. మేము ఎవరికి భయపడమని, కోర్టులోనే చూసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా తమపై కేసు…
గత కొంతకాలంగా తమను మీడియా ఎక్కువగా టార్గెట్ చేస్తోందని జీవితా రాజశేఖర్ వాపోయారు. తమ మీద కొందరు పని కట్టుకుని తప్పుడు భావన కలిగేలా సోషల్ మీడియాలో థంబ్ నెయిల్స్ పెడుతున్నారని అన్నారు. సినిమా రంగానికి సంబంధించిన ఏ అంశామైన తమను అందులోకి లాగుతున్నారని చెప్పారు. ప్రస్తుతం అరెస్ట్ వారెంట్ కు సంబంధించి వివరణ ఇవ్వడానికి జీవిత నిరాకరించారు. కోర్టు పరిధిలో ఆ విషయం ఉన్నందున ఎక్కువ మాట్లాడలేనని అన్నారు. గతంలో తాము ఎలాంటి డబ్బులూ కోటేశ్వరరాజుకు…
అక్టోబర్ 10న “మా” ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.. అయితే ‘మా’ వ్యవహారం టాలీవుడ్ లో కొత్త వివాదాలను తెర మీదకు తెస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా నిలిచిన బండ్ల గణేష్ ఇప్పుడు స్వతంత్రంగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. తొలుత జీవిత, హేమ సైతం అధ్యక్ష బరిలో పోటీ చేయాలని భావించారు. అయితే, ప్రకాశ్ రాజ్ వ్యూహాత్మకంగా జీవిత, హేమతో చర్చలు జరిపి…
‘మా’ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో బరిలో ఉన్న సభ్యులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇక నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో ఈరోజు సమావేశయ్యారు. ‘మా’ సభ్యులందరిని విందుకు ఆహ్వానించారు. దీంతో బండ్ల గణేశ్ ‘మా’ సభ్యులను విందుకు ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా భయంతో బ్రతుకుతున్న ఇటువంటి సమయంలో సినీకళాకారులందరిని విందు పేరుతో ఒక దగ్గర సమావేశపరచడాన్ని బండ్ల తప్పుబట్టారు. అయితే, బండ్ల గణేష్ వ్యాఖ్యలకు జీవితరాజశేఖర్ స్పందించారు. బండ్ల గణేష్…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ప్రకాష్ రాజ్ ప్యానల్ గుడ్‌బై చెప్పిన గణేష్.. ఆ ప్యానల్‌లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవితను టార్గెట్ చేశారు.. ఆమెపైనే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు ప్రకటించాడు.. ఇక, జీవిత రాజశేఖర్-చిరంజీవి ఫ్యామిలీ పాత గొడవలతో పాటు.. జీవిత పలు పార్టీలో మారంటూ కామెంట్లు చేశాడు బండ్ల గణేష్.. మా ఎన్నికల ఎపిసోడ్‌తో పాటు.. బండ్ల గణేష్ విమర్శలపై…