గత కొంతకాలంగా తమను మీడియా ఎక్కువగా టార్గెట్ చేస్తోందని జీవితా రాజశేఖర్ వాపోయారు. తమ మీద కొందరు పని కట్టుకుని తప్పుడు భావన కలిగేలా సోషల్ మీడియాలో థంబ్ నెయిల్స్ పెడుతున్నారని అన్నారు. సినిమా రంగానికి సంబంధించిన ఏ అంశామైన తమను అందులోకి లాగుతున్నారని చెప్పారు. ప్రస్తుతం అరెస్ట్ వారెంట్ కు సంబంధించి వివరణ ఇవ్వడానికి జీవిత నిరాకరించారు. కోర్టు పరిధిలో ఆ విషయం ఉన్నందున ఎక్కువ మాట్లాడలేనని అన్నారు. గతంలో తాము ఎలాంటి డబ్బులూ కోటేశ్వరరాజుకు ఇవ్వనవసరం లేదని కోర్టు చెప్పిందని, ఇప్పుడు తాజాగా అతను చేస్తున్న ఆరోపణలలోనూ బలం లేదని ఆమె చెప్పారు. కోర్టు అడిగితే వెళ్ళి వివరణ ఇస్తానని, తాను ఎక్కడకూ పారిపోలేదని జీవిత అన్నారు. కోర్టు కేసు తేలిన తర్వాత దాని పూర్వాపరాలను వివరిస్తానని చెప్పారు.
Read Also : Raveena Tandon : వాంతులు చేసుకుంటే క్లీనింగ్… హీరోయిన్ ఎలా అయ్యిందంటే?
అయితే గత కొంతకాలంగా నిహారిక, మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి కూడా చాలా దారుణమైన వార్తలను ట్రోల్ చేస్తున్నారని, తమ కుమార్తెల గురించి రకరకాల వార్తలను రాశారని అవన్నీ మానసికంగా ఎంతో బాధకు గురిచేస్తున్నాయని జీవిత అన్నారు. సెలబ్రిటీస్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని, ఇది పద్ధతి కాదని, దయచేసి ఒకసారి వివరణ తీసుకుని థమ్ నెయిల్స్ పెడితే బాగుంటుందని తెలిపారు. పాజిటివ్ థింకింగ్ తో తాను ముందుకు పోతానని, తామంటే నచ్చని వారెవరో వెనక నుండి ఇలాంటి పనులు చేస్తుంటారని ఆమె చెప్పారు. ఓవర్ యాంబిషన్ కారణంగా కోటేశ్వరరాజు ఇలా ప్రవర్తిస్తున్నారని అనిపిస్తోందని, ఆయన ఎవరి దగ్గరో చేసిన అప్పులను తమపై రుద్దాలని చూస్తున్నట్టుందని ఆమె తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో పైనాన్షియర్ బీరం సుధాకర్ రెడ్డి పేరు తీసుకురావడం కూడా సమంజసం కాదని జీవిత చెప్పారు.
2017లోనే కోటేశ్వరరాజు మీద డీ మానుటైజేషన్ కేసు ఉందని, పోలీసుల కళ్ళు గప్పి ఆయన తిరుగుతున్నారని ‘శేఖర్’ నిర్మాత శ్రీనివాస్ చెప్పారు. అసలు రూ.26 కోట్లు ఆయన ఎక్కడ నుండి తెచ్చి ఇచ్చారో కోటేశ్వరరాజు నిరూపించుకోవాల్సి ఉంటుందని శ్రీనివాస్ అన్నారు. జీవితకు – కోటేశ్వరరాజుకు మధ్య ఉన్న వివాదంలోకి తమ ఫైనాన్షియర్ బీరం సుధాకర్ రెడ్డి పేరు తీసుకురావడం దారుణమని చెప్పారు.