JDS: కర్ణాటకలో పాత మిత్రుడితో మళ్లీ జేడీఎస్ జతకట్టింది. బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు కుదరింది. రెండు రోజుల క్రితం జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్), బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరింది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, అతని కుమారుడు నిఖిల్ గౌడ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఎన్డీయేలో చేరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జేడీఎస్, బీజేపీల మధ్య పొత్తు చిగురించింది. రెండు పార్టీలు కలిసికట్టుగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని…
మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లో చేరనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జేడీఎస్ నేత కుమారస్వామి హోంమంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు.
JDS: మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) రేపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కర్ణాటక మాజీ సీఎం, దేవెగౌడ కొడుకు కుమారస్వామి గురువారం పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైనట్లు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇప్పటికే ఈ దిశగా సీట్ల పంపకాలపై కూడా ఇరు పార్టీలు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.
BJP-JDS Alliance: కర్ణాటకలో వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో మరోసారి బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య చర్చలు కూడా నమోదైనట్లు తెలుస్తోంది.
BJP-JDS alliance: కర్ణాటకలో కొత్త రాజకీయ సమీకరణం తెరపైకి వచ్చింది. పాత మిత్రుడు జేడీఎస్, బీజేపీ పంచన చేరబోతోంది. ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ దారుణం దెబ్బతింది. బీజేపీ ఓట్ షేర్ అలాగే ఉన్నా.. జేడీఎస్ ఓట్ షేర్ దారుణంగా పడిపోయింది. జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లడం ఆ పార్టీకి ప్రమాదఘంటికలు మోగించాయి. ఈ నేపథ్యంలో వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న…
Karnataka Former CM HD Kumaraswamy Admitted in Hospital: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ ముఖ్య నేత హెచ్‌డీ. కుమారస్వామి ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనను బుధవారం బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. హెచ్‌డీ కుమారస్వామి బుధవారం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు జిల్లాలోని శ్రీనివాసపురలోని రైతుల భూములను సందర్శించాల్సి ఉంది. అయితే ఆకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిండంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యులు…
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలిసి ప్రతిపక్షంగా కలిసి పనిచేయాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఈరోజు ప్రకటించారు.
పొలిటికల్ భేటీల నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కుమారస్వామి మాట్లాడుతూ.. జేడీఎస్‌ను విపక్షాలు తమ భాగస్వామిగా భావించడం లేనట్లుంది.. అందుకే తాను విపక్షాల మహాకూటమిలో చేరే ప్రసక్తి లేదని అన్నారు. ఇక, ఇదే టైంలో ఎన్డీయే కూటమి సమావేశంపై కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
జూలై18న ఎన్డీయే కూటమి కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి పలు పార్టీలకు ఆహ్వానాలు పంపించేందుకు ఎన్డీఏ సిద్ధమయినట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఏ కూటమికి చెందని మరికొన్ని పార్టీలను ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు పార్టీలతో పొత్తుల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది.
Karnataka: 2024 లోక్ సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సారి బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడేందుకు చర్చలు జరుగుతున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. టీఎంసీ, ఎన్సీపీ, జేడీయూ, ఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలు విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నాయి. అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తే ఈ సారి మోడీని గద్దె దించవచ్చని భావిస్తున్నాయి.