ఇదిలా ఉంటే బీజేపీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం లేని పార్టీని దేశంలో చూపించండి అంటూ దేవెగౌడ సవాల్ విసిరారు. దేశం మొత్తంలో ఒక్కపార్టీనైనా చూపించాలని, అప్పుడు నేను సమాధానం చెబుతానని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న విపక్ష ఐక్యత ప్రయత్నాలపై అడిగిన ప్రశ్నకు దేవెగౌడ మంగళవారం సమధానమిచ్చారు.
Karnataka : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. హస్తం పార్టీ గెలుస్తుంది అనుకున్నారు కానీ ఇంత మెజార్టీ వస్తుందని ఎవరూ ఊహించలేదు.
JDS: కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే తామే కీలకం అవుతామని కుమారస్వామి భావించారు. తమ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో సత్తా చాటితే చాలనుకున్నారు. కానీ జనం ఆలోచన మాత్రం వేరేగా ఉంది. 35నుంచి 40 స్థానాలైనా గెలవాలని టార్గెట్ పెట్టుకుంటే అందులో సగం మాత్రమే ఇచ్చారు. 224 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో జేడీఎస్ గెలిచింది కేవలం 20 స్థానాల్లో మాత్రమే… దేవెగౌడ సామాజిక వర్గం వక్కలిగ. వారు ఎక్కువగా ఉన్న…
Nikhil Gowda: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది.. కాంగ్రెస్ వేవ్‌లో ఏకంగా 11 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు.. ఇక, ఈ ఎన్నికల బరిలో దిగిన యంగ్ హీరోకి ఓటమి తప్పలేదు.. కాంగ్రెస్ దెబ్బకు పరాజయంపాలైన వారిలో కన్నడ యువ హీరో నిఖిల్ గౌడ అలియాస్ నిఖిల్ కుమారస్వామి కూడా ఒకరు.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడైన నిఖిల్.. 10 వేలకు పైగా ఓట్లతో ఓటమి చవిచూశారు.. ఈఎన్నికల్లో కుమారస్వామి గెలిచినా..…
BJP: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. 224 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 113ని దాటి ఏకంగా 136 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. బీజేపీ 64, జేడీఎస్ 20 స్థానాలకే పరిమితం అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులుగా చేస్తూ హంగ్ అసెంబ్లీకి తావు లేకుండా కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఎన్నాళ్ల నుంచో విజయం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ గెలుపు కొత్త ఉత్తేజాన్ని తీసుకువచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికలను…
Kamal Haasan: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం నమోదు చేసింది. 224 స్థానాల్లో 136 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ 65, జేడీఎస్ 20 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ విజయంపై బీజేపేతర ప్రతిపక్షాలు రాహుల్ గాంధీకి, సోనియాగాంధీకి, ఇతర కాంగ్రెస్ ముఖ్యనేతలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తమిళ స్టార్ కమల్ హాసన్ కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై స్పందించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రాన్ని మరో ఐదేళ్ల పాటు పాలించేదెవరో అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో ఏ పార్టీని పూర్తిగా విశ్వసించని కన్నడ ప్రజలు ఈ సారి మరో ఐదేళ్లకు ఎవరి చేతిలో పగ్గాలు పెడతారో నేడు తెలుస్తుంది. వచ్చే ఏటా నిర్వహించే లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటక ఫలితాలు ఎంతో కీలకమని విశ్లేషణలు ఊపందుకున్న సమయంలో ఫలితం కోసం దేశవ్యాప్త రాజకీయ పార్టీలు…
Karnataka Election Results: సంప్రదాయంగా బీజేపీకి అండగా నిలుస్తున్న లింగాయత్ వర్గం ఈ సారి ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. బీజేపీ చివరి నిమిషంలో రిజర్వేషన్లు ప్రకటించినా కూడా లింగాయల్ వర్గంలో ఉన్న అసంతృప్తిని అణచలేకపోయారు. ఫలితంగా బీజేపీకి గట్టి పట్టున్న స్థానాల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా మెజారిటీ స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ఈ రోజు వెలువడిన ఎన్నికల్లో ట్రెండ్స్ ను పరిశీలిస్తే ఇదే అర్థం అవుతుంది.
DK Shivakumar: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం వైపు వెళ్తోంది. మెజారిటీ మార్కును దాటేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 138 స్థానాల్లో, బీజేపీ 63, జేడీఎస్ 20 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ విజయంపై కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటకలో సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. కర్ణాటక ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ద్వేషంతో చేసే రాజకీయాలు ముగిశాయని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రేమతో విజయం సాధించామని అన్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ద్వేషం యొక్క మార్కెట్ మూసివేయబడింది మరియు ప్రేమ దుకాణాలు తెరవబడ్డాయి" అని ఆయన అన్నారు.