Prajwal Revanna: మహిళపై అత్యాచారం చేసిన కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూర్ కోర్టు ‘‘జీవిత ఖైదు’’ శిక్షను విధించింది. తన ఇంట్లో పనిచేసే మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆ చర్యని వీడియో తీసి, పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. దీంతో కోర్టు అతడికి జీవితఖైదు శిక్షను విధించింది. రూ. 524 నెలవారీ వేతనం కోసం 8 గంటల పాటు రోజూవారీ పని చేయాలని ఆదేశించింది.
కర్ణాటక అసెంబ్లీలో ఓ సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే వింత ప్రతిపాదన తీసుకొచ్చారు. పురుషులకు వారానికి రెండు బాటిళ్ల ఉచిత మద్యం ఇవ్వాలని జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప అసెంబ్లీలో డిమాండ్ చేశారు. నేడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాన్ని రూ.36,500 కోట్ల నుంచి రూ.40,000 కోట్లకు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దీనిని వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ దీని కోసం మళ్ళీ పన్నులు పెంచాల్సి ఉంటుంది.…
Karnataka : కేంద్ర ఉక్కు మంత్రి, జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి శనివారం కర్ణాటక ముఖ్యమంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు.
సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ- జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్పందించాలని ముఖ్యమంత్రిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించాగా.. సహనం కోల్పోయిన ఆయన, మైక్‌లను పక్కకు తోసేసి.. అవసరమైతే నేనే పిలిచి మాట్లాడుతాగా అంటూ సీరియస్ అయ్యారు.
దేశ మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనగర్ నుంచి బారాముల్లా వరకు రైల్వే లైన్‌ను పరిశీలించి, ప్రయాణికుల సౌకర్యాలపై సమాచారం తీసుకున్నారు.
HD Kumaraswamy: కర్ణాటకలో బీజేపీ, మిత్రపక్షం జేడీఎస్ మధ్య విభేదాలు చెలరేగాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణికి సంబంధించి మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేజీ బెంగళూర్ నుంచి మైసూర్ వరకు పాదయాత్ర పిలుపునిచ్చింది.
VIDEO: బెంగళూర్‌లోని గోల్డ్ ఫించ్ హోటల్‌లో బీజేపీ-జేడీఎస్ పాదయాత్ర గురించి కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతున్న సమయంలోనే ఆయన ముక్కు నుంచి రక్తం ధారాళంగా కారింది. ఉన్నట్లుండి జరిగిన ఈ సంఘటనతో అక్కడ ఉన్న వారంతా ఏమైందనే భయాందోళన వ్యక్తం చేశారు.
Prajwal Revanna Scandal: గత నెలలో కర్ణాటకలో జేడీఎస్ మాజీ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా రేవణ్ణ ఫ్యామిలీకి పట్టున్న హసన్ జిల్లాలో ఈ సెక్స్ వీడియోలు వైరల్‌గా మారాయి.