Karnataka: మారుతున్న కర్ణాటక రాజకీయ ముఖచిత్రం.. బీజేపీకి దగ్గరవుతున్న మాజీ మిత్రుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: 2024 లోక్ సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సారి బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడేందుకు చర్చలు జరుగుతున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. టీఎంసీ, ఎన్సీపీ, జేడీయూ, ఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలు విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నాయి. అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తే ఈ సారి మోడీని గద్దె దించవచ్చని భావిస్తున్నాయి.
Also Read
ఇదిలా ఉంటే ఇన్నాళ్లు బీజేపీ అంటే అంటీముట్టనట్లు ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ అయిన జనతాదల్ సెక్యులర్(jds) మాత్రం బీజేపీకి దగ్గరవుతున్న వాతావరణం కనిపిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీ-జేడీఎస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఈ సారి 2024 ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 ప్రతిపక్ష ఐక్యత గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు జేడీఎస్. బీజేపీకి మాజీ మిత్రుడైన జేడీఎస్ కలిసి 2006లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2006లో ఈ రెండు పార్టీలు కలిసి సంక్షీర్ణాన్ని ఏర్పాటు చేసిన అయితే ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం.. ముఖ్యమంత్రి కుమారస్వామి, తన డిప్యూటీ అయిన యడియూరప్పకు అధికారాన్ని బదిలీ చేయకపోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది.
గత నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలు కాంగ్రెస్ చేతిలో ఓడిపోయాయి. జేడీఎస్ 224 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 19 స్థానాలను గెలిచింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో జతకడితే.. తన ఓట్ బేస్ ను కాపాడుకునే అవకాశం ఉందని జేడీఎస్ భావిస్తోంది. ఇటీవల నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్ తో పాటు అన్ని ప్రధాన విపక్ష పార్టీలు బహిష్కరించినా.. జేడీఎస్ తరుపున దేవెగౌడ హాజరయ్యారు. ఇటీవల బాలాసోర్ రైలు ప్రమాదం సమయంలో విపక్షాలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామాకు డిమాండ్ చేశాయి. అయితే ఆ సమయంలో కూడా దేవెగౌడ బీజేపీకి మద్దతుగా నిలిచారు. అశ్విని వైష్ణవ్ ని సమర్థించారు. తాజాగా విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీతో సంబంధం పెట్టుకోని ఒక్క పార్టీనైనా చూపించాలంటూ సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!