Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతోంది. 139 స్థానాల్లో ఇప్పటికే లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలని ఆశిస్తున్నట్లు సిద్దరామయ్య అన్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్ గాంధీ 2024లో ప్రధాని అవుతారని కాంగ్రెస్ అధినేత ఆశాభావం వ్యక్తం చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్, బ్యాలెట్లు వయోవృద్ధుల ఓట్లు లెక్కిస్తారు. ఈ సారి వయో వృద్ధులకు ఇంట్లో నుంచే ఓటు విధానం కల్పించారు. ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. అయితే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ, మ్యాజిక్ ఫిగర్ 113 రాకపోవచ్చని, హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో మరోసారి జేడీఎస్ కింగ్ మేకర్ పాత్రను పోషించేందుకు సిద్ధం అయింది. అయితే ఇలాంటి పరిస్థితి వస్తే అధికారం ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమను సంప్రదించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు జేడీఎస్ చెబుతోంది. అయితే ఇటు బీజేపీ కానీ,…
Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లు తమ చైతన్యాన్ని చూపారు. 224 అసెంబ్లీ స్థానాలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో 73.19 శాతం ఓటింగ్ నమోదు అయింది. గతంలో 2018 ఎన్నికల నమోదైన 72.44 శాతంతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువగా రికార్డ్ అయింది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు మెజారిటీ స్థానాలు వచ్చినా.. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని, కొన్ని సర్వేలు మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తాయని వెల్లడించాయి.
Karnataka Election: కర్ణాటక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసింది.. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కర్ణాటక ఎన్నికలపై ఆది నుంచి తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్ సాగుతోంది.. ఇక, పోలింగ్ ముగిసిన తర్వాత.. కర్ణాటకలో గెలుపెవరిది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటూ బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.. పోలింగ్ ముందు వరకు ఒక అంచనాతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు.. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ చూసి కొత్త ఎత్తులు వేస్తున్నారు.…
జేడీఎస్ ఎన్నికల అనంతర పొత్తును కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ రద్దు చేశారు. తమ పార్టీకి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. "జేడీఎస్‌తో పొత్తుకు అవకాశం లేదు. మేమే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము." అని శివకుమార్ కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం విలేకరులతో అన్నారు.
Karnataka Elections: కర్ణాటకలో 20 రోజులుగా సాగిన ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. ర్యాలీలు, రోడ్ షోలకు తెరపడింది. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వస్తాయి. ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారనే విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీల చూపంతా బెంగళూరుపైనే ఉంది. అందుకే ఆఖరి పంచ్ ఐటీ సిటీలో ఇచ్చాయి ప్రధాన పార్టీలు. కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా…
కర్ణాటక అసెంబ్లీ 2023 ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొన్ని రోజులుగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నుంచి ముఖ్య నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
PM Modi: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు శక్తివంచన లేకుండా అధికారం కోసం ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ పెద్ద ఎత్తున ప్రచారకార్యక్రమాలను ప్రారంభించారు. ఆదివారం కోలార్ ప్రాంతంలో ఆయన ప్రచారం చేశారు. కోలార్ లో జరిగిన సభ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు నిద్రపట్టకుండా చేస్తుందని అన్నారు. ఈ రెండు పార్టీలు కర్ణాటక అభివృద్ధికి అవరోధంగా తయారయ్యాయన్నారు. ప్రజలు వాటిని క్లీన్ బౌల్డ్ చేశారని, కాంగ్రెస్, జేడీఎస్ అవినీతి…