ఇవాళ ( సోమవారం ) బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం జరుగనుండటంతో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అలర్ట్ అయ్యింది. ఈనేపథ్యంలో రేపు(మంగళవారం) ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల మీటింగ్ జరుగనుంది. దీంతో, దేశంలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. ఇక, ఇప్పటికే విపక్షాల సమావేశానికి 26 పార్టీలకు ఆహ్వానం అందింది. ఎన్డీయే కూటమి సమావేశానికి సుమారు 30 పార్టీలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. కాగా, ప్రతిపక్ష నేతల సమావేశం స్టార్ట్ కానుంది.
Read Also: Anasuya Bharadwaj: హద్దులు చెరిపేసిన అనసూయ.. వామ్మో ఈ అందాల ఆరబోత నెవర్ బిఫోర్!
ఇదిలా ఉండగా.. పొలిటికల్ భేటీల నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కుమారస్వామి మాట్లాడుతూ.. జేడీఎస్‌ను విపక్షాలు తమ భాగస్వామిగా భావించడం లేనట్లుంది.. అందుకే తాను విపక్షాల మహాకూటమిలో చేరే ప్రసక్తి లేదని అన్నారు. ఇక, ఇదే టైంలో ఎన్డీయే కూటమి సమావేశంపై కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఎన్డీయే నుంచి తమకు ఎలాంటి ఆహ్వానం రాలేదు.. ఆ ఫ్రంట్ ఎలా ఉంటుందో చూద్దామంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Read Also: Mana Kulapodu: ‘బేబీ’లో ‘మన కులపోడు’కి బాగా కుదిరిందే!
మరోవైపు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జాతీయస్థాయి నాయకులు అనుకుంటుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలు ఇందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంటే తమ ఓటు బ్యాంకును అప్పనంగా ఆ పార్టీకి అప్పజెప్పడమేనని రాష్ట్ర బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లను కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ విజయం సాధించడంతో సర్కారును ఏర్పాటు చేసింది. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు వస్తుండటంతో.. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుండా జేడీఎస్ తో బీజేపీ చేతులు కలపాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.