Jaishankar: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్‌సీ)లో శాశ్వత సభ్య దేశంగా భారత్‌కి ముందుగా అవకాశం వచ్చిందని, అయితే భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కారణంగా అది చైనాకు దక్కిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
Jaishankar: భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విదేశాంగ విధానంపై విదేశాంగ మంత్రి జైశంకర్ సెటైర్లు వేశారు. ఇప్పటికీ కొందరు నెహ్రూ విధానాన్ని గొప్పగా భావిస్తున్నారని, అది బుడగ మాత్రమే అని అన్నారు. నెహ్రూ ఆరాధన నుంచి బయటపడాలని చెప్పారు. న్యూస్ 18 రైజింగ్ భారత్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
PM Modi: పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. స్వాతంత్ర అనంతరం కాంగ్రెస్ బానిస మనస్తత్వం వల్ల దేశం వెనకబడి పోయిందని, గత 10 ఏళ్లలో దేశాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కాంగ్రెస్ ని పుట్టించిందే బ్రిటీష్ వ్యక్తి అని ఎద్దేవా చేశారు. నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించారని ఆరోపించారు.
PM Modi: రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ యువరాజును స్టార్-అప్‌గా ప్రజెంట్ చేసిందని, కానీ నాన్ స్టార్టప్ అని తేలిందని’’ అన్నారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించిన అతడిని లాంచ్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
PM Modi: రాజ్యసభ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. దళితులు, వెనకబడినవారికి, గిరిజనులకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమని, ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లకు జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకమని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఆరోపించారు. ఓబీసీలకు ఎప్పుడూ పూర్తి రిజర్వేషన్లు ఇవ్వని కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని బోధించకూడదని అన్నారు. అంబేద్కర్ భారతరత్నకు అర్హడని కాంగ్రెస్ ఎప్పుడూ భావించలేదని ఆయన అన్నారు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విధానాలపై విమర్శనాత్మకంగా స్పందించారు. చైనాతో భారత సంబంధాల విషయంలో మాట్లాడుతూ ఆయన చరిత్రలో జరిగిన అంశాలను గుర్తు చేశారు. ఢిల్లీలో ‘వై భారత్ మాటర్స్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్.. చైనా, పాకిస్తాన్, అమెరికా సంబంధాలను గురించి మాట్లాడారు.
Pranab Mukherjee : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ రచించిన 'ప్రణబ్ మై ఫాదర్ ఎ డాటర్ రిమెంబర్స్' పుస్తకాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు అని.. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
చంద్రయాన్-3 విజయవంతం కావడంతో నేడు ప్రపంచం మొత్తం భారతీయ శాస్త్రవేత్తలను కొనియాడుతోంది. ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి వెళ్లి శాస్త్రవేత్తలను అభినందించి తదుపరి మిషన్‌ను ప్రోత్సహించారు.