CM YS Jagan: మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు అని.. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా బాలబాలికలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యతను పెంచామన్నారు సీఎం జగన్. అంగన్‌వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని ఆయన తెలిపారు.
Also Read: AP Governor Tour: రేపు గవర్నర్ అరకులోయ పర్యటన
“మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చాం. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచాం. అంగన్‌వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు. రాష్ట్రంలోని బాలబాలికలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.” అని సీఎం ట్వీట్ చేశారు.
మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చాం. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచాం.
అంగన్‌వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2023