Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరోక్షంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై విరుచుకుపడ్డారు. నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం పాలక పార్టీ(బీజేపీ) ప్రధాన లక్ష్యంగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై దుష్ప్రచారం చేయడం, ఆయన కించపరచమే అని ఆరోపించారు. ఒక పద్ధతి ప్రచారం ఆయన వారసత్వాన్ని తుడిచివేసే ప్రయత్నం జరుగోతందని ఆమె అన్నారు. నెహ్రూ నిర్మించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పునాదులను బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.
న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ భారీ విజయం సాధించారు. న్యూయార్క్‌కు తొలి ముస్లిం మేయర్‌గా చరిత్ర సృష్టించారు. అది కూడా 34 ఏళ్ల వయసులో న్యూయార్క్ మేయర్ కావడం శతాబ్ద కాలంలో ఇదే మొదటిసారి. మమ్దానీ విజయం వెనుక చాలా చరిత్రనే ఉంది. ఇతడు ఇండియన్-అమెరికన్ కావడం కూడా విశేషం.
PM Modi: భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని పీఎం మోడీ ఆరోపించారు. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో విభజించగా.. మన దేశానికి చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విడగొట్టారన్నారు.
దేశ ప్రధానిగా మోడీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. దేశ చరిత్రలో అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా పని చేసిన రికార్డ్‌ను మోడీ సొంతం చేసుకున్నారు. శుక్రవారంతో 4,078 రోజులు పదవీకాలం పూర్తి చేసుకున్నారు.
Dalai Lama: టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వ్యవహారం ఇప్పుడు భారత్-చైనాల మధ్య వివాదంగా మారింది. తదుపరి దలైలామా వారసుడు చైనా సార్వభౌమాధికారానికి చట్టానికి లోబడి ఉండాలని ఆ దేశం చెప్పింది. అయితే, దలైలామా వారసుడుని ఆయన మాత్రమే నిర్ణయించే హక్కు ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అయితే, ఈ విషయంపై చైనా స్పందిస్తూ, దలైలామా వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది.
PM Modi: దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని ఉటంకిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై విరుచుకుపడ్డారు. విదేశాంగ విధానంపై ఆసక్తి ఉన్నవారు ‘‘జెఎఫ్‌కే ఫర్‌గటెన్ క్రైసిస్’’ బుక్ చదవాలని ప్రధాని మోడీ మంగళవారం పార్లమెంట్లో అన్నారు. ఈ పుస్తకం అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడ, అప్పటి ప్రధాని నెహ్రూ మధ్య సమావేశం గురించి తెలియజేస్తుంది.
Congress Foundation Day : బ్రిటిష్ వారి నుండి దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో ప్రముఖ పాత్ర పోషించిన కాంగ్రెస్, ఒక ఆంగ్లేయుడు స్థాపించాడు. అప్పుడు, బ్రిటీష్ వారి ఆదేశానుసారం, బ్రిటీష్ అధికారి AO హ్యూమ్ 28 డిసెంబర్ 1885న ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి వేదికను ఏర్పాటు చేశారు. అయితే, దాని రూపం కాలక్రమేణా మారిపోయింది , దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత, మహాత్మా గాంధీ కూడా దానిలో చేరారు , భారత స్వాతంత్ర్య…
దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్న ఆయన.. స్వాతంత్య్రం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందన్నారు.
Jaishankar: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో శాశ్వత సభ్య దేశంగా భారత్కి ముందుగా అవకాశం వచ్చిందని, అయితే భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కారణంగా అది చైనాకు దక్కిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
Jaishankar: భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విదేశాంగ విధానంపై విదేశాంగ మంత్రి జైశంకర్ సెటైర్లు వేశారు. ఇప్పటికీ కొందరు నెహ్రూ విధానాన్ని గొప్పగా భావిస్తున్నారని, అది బుడగ మాత్రమే అని అన్నారు. నెహ్రూ ఆరాధన నుంచి బయటపడాలని చెప్పారు. న్యూస్ 18 రైజింగ్ భారత్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.