Pranab Mukherjee : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ రచించిన ‘ప్రణబ్ మై ఫాదర్ ఎ డాటర్ రిమెంబర్స్’ పుస్తకాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జవహర్‌లాల్ నెహ్రూ, వీర్ సావర్కర్‌ల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య తలెత్తిన వివాదంపై ప్రణబ్ ముఖర్జీ ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో శర్మిష్ట ముఖర్జీ తన పుస్తకంలో చెప్పారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో జవహర్‌లాల్ నెహ్రూ ఎలాంటి కృషి చేయలేదని ఓ వైపు బీజేపీ అంటుంటే మరోవైపు వీర్ సావర్కర్ పిరికివాడని కాంగ్రెస్ అంటోంది. అందుకే, మా నాన్న ప్రణబ్ ముఖర్జీ, నేనూ ఇలాంటి కథలు దేశానికి ఆరోగ్యకరం అనుకోవడం లేదని శర్మిష్ట ముఖర్జీ అన్నారు.
Read Also:Rajinikanth: ఇలాంటి సూపర్ స్టార్ ని చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్…
VIDEO | "On one hand, BJP says that Jawaharlal Nehru does not have any contribution (towards India's freedom struggle) while on the other hand, Congress says that Veer Savarkar was a coward. So, my father (Late Pranab Mukherjee) and I do not feel that such narratives are healthy… pic.twitter.com/IHIxILBmke
— Press Trust of India (@PTI_News) December 11, 2023
Read Also:Anganwadi strike: నేటి నుంచి అంగన్‌వాడీల సమ్మె.. అన్ని కేంద్రాలు మూత..
ఈ పుస్తకాన్ని ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆవిష్కరించారు. ప్రధాని మోడీ ఆయనకు నివాళులర్పించారు. ఆయన రాజకీయ చతురత దేశ దిశను నిర్దేశించిందని అన్నారు. 1935లో జన్మించిన ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు దేశానికి 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ 2020 ఆగస్టు 31న మరణించారు. ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్ వంటి ప్రధానులతో కలిసి పనిచేశారు. పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన ప్రణబ్ ముఖర్జీని వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా అని కూడా పిలుస్తారు. అతని జ్ఞాపకశక్తి, పదునైన తెలివితేటలు, సమస్యలపై లోతైన అవగాహనను అందరూ మెచ్చుకున్నారు.