Umran Malik Shatters Jasprit Bumrah Record: వేగవంతమైన బంతులతో ‘జమ్మూ ఎక్స్‌ప్రెస్’గా పేరొందిన ఉమ్రాన్ మాలిక్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేసి, అత్యంత వేగవంతమైన భారత పేసర్‌గా అవతరించాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ జస్‌ప్రీత్ బుమ్రా పేరిట ఉండేది. అతడు 153.36 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి, ఫాస్టెస్ట్ బాల్ విసిరిన బౌలర్‌గా తన పేరిట రికార్డ్ లిఖించుకున్నాడు. అయితే.. ఆ రికార్డ్‌ని ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ బద్దలుకొట్టేశాడు. ఈ రేసులో ఇప్పుడు ఉమ్రాన్ అగ్రస్థానంలో, బుమ్రా రెండో స్థానంలో ఉండగా.. మహమ్మద్ షమీ (153.3), నవదీప్ సైనీ (152.85) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
MLA Chinnaiah: టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే చిన్నయ్య
మరో విశేషం ఏమిటంటే.. తాను వేగంగా వేసిన బంతికే లంక కెప్టెన్ దసున్ షణకని ఉమ్రాన్ ఔట్ చేశాడు. వీరోచితమైన బ్యాటింగ్‌తో తన జట్టుని గెలిపించుకునే దూకుడులో ఉన్న షణకి ఔట్ చేసి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఉమ్రాన్ వేసిన ఆ వేగవంతమైన బంతిని షణక షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. అది నేరుగా యుజ్వేంద చాహల్ చేతుల్లోకి క్యాచ్‌గా వెళ్లింది. దీంతో అతడు పెవిలియన్ చేరాల్సి వచ్చింది. షణకతో పాటు చరిత్ అసలంక వికెట్‌ని కూడా ఉమ్రాన్ తీశాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా నాలుగు ఓవర్లు వేసిన ఉమ్రాన్.. 27 పరుగులు ఇచ్చి, రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20లోకి అడుగుపెట్టిన బౌలర్ శివం మారి నాలుగు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ 2 వికెట్లు తీశాడు.
Upcoming Electric Cars in 2023: ఈ సంవత్సరం మార్కెట్‌లోకి వస్తున్న ఎలక్ట్రిక్ కార్లు
ఈ మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరి చరిత్ర సృష్టించిన ఉమ్రాన్ మాలిక్‌పై సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. వేగంలోనే కాకుండా లైన్ అండ్ లెంగ్త్‌లోనూ ఉమ్రాన్ మెరుగుపడుతున్నాడని భారత వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సైతం మాలిక్‌కు మద్దతుగా ట్వీట్ చేస్తూ.. ఉమ్రాన్ మాలిక్‌ని ప్రేమించడానికి 155 కారణాలు’’ అంటూ పేర్కొంది. అభిమానులు సైతం అతనిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Jaydev Unadkat: చరిత్ర సృష్టించిన జయదేవ్.. ట్రోఫీ హిస్టరీలోనే తొలిసారి