బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. దీంతో ఫుల్ జోష్‌లో ఉన్న ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్. వెన్నునొప్పి నుంచి కోలుకుంటూ టీమిండియాకు చాలా కాలంగా దూరంగా ఉన్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరికొంత కాలం పాటు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో అతడు చాలా కీలకం అవుతాడని చాలామంది భావించారు. కానీ గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోలేదు. దీంతో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో బుమ్రాకు చోటు దక్కలేదు.
Also Read: Paytm: పేటీఎంకు అలీబాబా షాక్..పెట్టుబడులు ఉపసంహరణ
అయితే చివరి రెండు టెస్టులకు బుమ్రా అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్‌లో కూడా బుమ్రా ఆడతాడని కొందరు చెప్పారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమయం పడుతుందట. దీంతో ఆసీస్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు కూడా అతను దూరం అవుతున్నట్లు బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా రాకపోవడం గమనార్హం. కొన్నిరోజులుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు బుమ్రా. తిరిగి జట్టులోకి రావడానికి ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో అతనికి వెన్నులో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని, అదే ప్రస్తుతానికి శుభవార్త అని ఎన్‌సీఏ వర్గాలు తెలిపాయి. ఇకపోతే, ఆసీస్‌తో వచ్చే నెలలో జరిగే వన్డే సిరీస్‌లో అయినా బుమ్రా ఆడతాడా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో అప్పుడే నిర్ణయం తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోందట.
Also Read: T20 Womens WorldCup: పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్..స్టార్ ఓపెనర్ దూరం!