Jasprit Bumrah Ruled Out Of IPL 2023 Due To Back Surgery: వెన్ను నొప్పి కారణంగా గత సెప్టెంబర్ నుంచి టీమిండియాకు దూరంగా ఉంటోన్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఐపీఎల్ 2023లో కంబ్యాక్ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం అతడు ఐపీఎల్ కూడా దూరం కానున్నట్టు తేలింది. వెన్ను నొప్పి నుంచి ఇంకా కోలుకోకపోవడమే అందుకు కారణం. త్వరలోనే ఇతనికి సర్జరీ చేయనున్నట్టు తెలిసింది. ఇది ముంబై ఇండియన్స్ జట్టుకి పెద్ద ఝలకేనని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఆ జట్టులో బుమ్రా అత్యంత కీలక ఆటగాడు. ఎన్నోసార్లు తన బౌలింగ్‌తో మాయ చేసి, అతడు జట్టుని గెలిపించాడు. అలాంటి ఆటగాడు మిస్ అవ్వడం, ఆ జట్టుకి తీరని లోటేనని చెప్పుకోవాలి. అంతకుమించిన మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కూడా బుమ్రా ఆడకపోవచ్చు. ఆస్ట్రేలియాను చిత్తు చేయడాన్ని బట్టి చూస్తుంటే, ఫైనల్స్‌కి భారత్ దాదాపు తన బెర్త్‌ని కన్ఫమ్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇది గుడ్ న్యూస్ అయినా, సర్జరీ కారణంగా బుమ్రా ఆ సమయానికల్లా కోలుకోవడం కష్టమే కాబట్టి, అతను అందుబాటులో ఉండకపోవచ్చు.
Delhi Liquor Scam: తమ పదవులకు రాజీనామా చేసిన సిసోడియా, సత్యేంద్ర జైన్
నిజానికి.. గతేడాది ఆగస్టులోనే కంబ్యాక్ ఇచ్చేందుకు బుమ్రా ప్రయత్నించాడు కానీ, వెన్ను నొప్పి అతడ్ని మరింత దెబ్బతీసింది. దాంతో అతడు ఆసియా కప్‌కి దూరమయ్యాడు. అనంతరం అతని పరిస్థితి కాస్త మెరుగుపడినట్టు అనిపించడంతో.. టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో చోటు దక్కింది. అతడు ఆస్ట్రేలియాపై రెండు టీ20 మ్యాచ్‌లు సైతం ఆడాడు. కానీ.. మూడు రోజుల తర్వాత బుమ్రా వెన్నునొప్పికి గురవ్వడంతో.. స్కాన్ చేశారు. వెన్నునొప్పి తీవ్రమైందని రిపోర్ట్స్ రావడంతో.. వెంటనే ఎన్‌సీఏకు బుమ్రాను తరలించారు. అక్కడ మరోసారి స్కాన్ చేయగా.. బుమ్రాకు ఉన్న సమస్య చాలా తీవ్రమైనదని తేలడంతో.. టీ20 వరల్డ్‌కప్‌కి దూరమయ్యాడు. ఆ సమస్య నుంచి కోలుకున్న తర్వాత డిసెంబర్‌లో తిరిగి బౌలింగ్ వేయడం ప్రారంభించాడు. బుమ్రా యాక్టివ్‌గానే కనిపించడంతో.. వెన్నునొప్పి నుంచి అతనికి విముక్తి కలిగినట్టేనని అనుకున్నారు. ఫిట్నెస్ టెస్టుల్లో మళ్లీ తేడాగా అనిపించడంతో.. శ్రీలంక సిరీస్, బార్డర్ గవాస్కర్ ట్రోఫీలకు దూరమయ్యాడు. ఇంకా అతడు కోలుకోకపోవడం, సర్జరీకి వెళ్తుండటంతో.. ఐపీఎల్ నుంచి పూర్తిగా వైదొలగాల్సి వస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లోపు బుమ్రా కోలుకుంటే బెటర్.
Bandi Sanjay: తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం.. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం