ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ కొడుకు వరుణ్; ప్రముఖ నటి, నిర్మాత శ్రీదేవి, బోనీకపూర్‌ల కుమార్తె జాన్వీ కపూర్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా ‘బవాల్’. ఈ క్యూట్ లవ్ స్టోరీని ‘దంగల్’, ‘చిచ్చోరే’ ఫేమ్ నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు. సాజిద్ నడియాద్ వాలా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య లక్నోలో మొదలైంది. ఓ పట్టణానికి చెందిన కుర్రాడు, తమ ఊరికే చెందిన ఓ అందమైన అమ్మాయిని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలని కలలుకంటూ…
ఆర్ఆర్ఆర్ సినిమాతో జూ. ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ రావడం వల్ల.. అతని తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్టుగానే తీర్చిదిద్దేందుకు దర్శకులు చాలా కసరత్తులే చేస్తున్నారు. కథ పరంగానే కాదు, నటీనటుల్ని కూడా ఏరికోరి మరీ తీసుకుంటున్నారు. ఆయా భాషా పరిశ్రమల్లో పేరుగాంచిన వారిని రంగంలోకి దింపుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా NTR31 ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త తెరమీదకి వచ్చింది. కొరటాల శివతో NTR30 చేస్తోన్న తారక్.. ఆ తర్వాత…
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అదిగో ఆ సినిమాతో, ఇదిగో ఈ చిత్రంతో అంటూ.. త్వరలో జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతోందని చాలా పుకార్లొచ్చాయి. కానీ, అవేవీ వాస్తవం కాదని తేలిపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం ఈమె టాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయినట్టు జోరుగా ఓ పుకారు చక్కర్లు కొడుతోంది. జూ. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న విషయం…
నాలుగేళ్ళ క్రితం ‘థడక్’ మూవీతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’, ‘రూహీ’ చిత్రాలలో నటించింది. ఈ రెండు సినిమాలు నటిగా ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అలానే ‘ఘోస్ట్ స్టోరీస్’ వెబ్ సీరిస్ లోనూ ఓ ఎపిసోడ్ లో నటించింది. మంచి కథలు ఎక్కడ ఉన్నా వాటిని చేజిక్కించుకోవాలని జాన్వీ కపూర్ తాపత్రయ పడుతోంది. అందులో భాగంగానే ఓ తమిళ…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తాజాగా తన అభిమానులను అద్భుతమైన ఫోటోషూట్లతో ట్రీట్ చేస్తోంది. తాజా పిక్స్ ఆమె అభిమానులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. గ్రాజియాఇండియా మిలీనియల్ అవార్డుల వేడుకలో జాన్వీకపూర్ మెరిసిపోయే సిల్వర్ కలర్ డ్రెస్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అందాలను దాచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని జాన్వీ ఈ పిక్స్ లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోతోంది. రోజురోజుకూ జాన్వీ…
గత కొంతకాలంగా వరుణ్ ధావన్, ‘చిచ్చోరే’ ఫేమ్ నితిష్ తివారి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతోందనే వార్తలు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ పుకార్లకు తెర దించుతూ దర్శకనిర్మాతలు చిత్ర కథానాయకుడు వరుణ్ ధావన్ అధికారిక ప్రకటన చేశారు. వరుణ్ ధావన్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా ‘బవాల్’ పేరుతో సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా తెలిపారు. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని,…
అతిలోక సుందరి శ్రీదేవి మనల్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లి మరో సంవత్సరం పూర్తి అయ్యింది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి అకాల మరణం లక్షలాది మంది అభిమానుల హృదయాలను కలచి వేసింది. శ్రీదేవి కన్నుమూసి నాలుగేళ్లు అవుతున్న తరుణంలో దివంగత నటికి హృదయపూర్వక నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా ఆమె మరణ వార్షికోత్సవం సందర్భంగా తన తల్లిని గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది.…
అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బీటౌన్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. వరుస సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక తన గ్లామర్ తో యూత్ దృష్టిని తనవైపుకు తిప్పుకోవడంలో ఆమెకు ఆమే సాటి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే జాన్వీ ఫోటోలు చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇక జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా రూమర్స్ విన్పిస్తున్నాయి. ఇటీవల కాలంలో…