Vijay Devarakonda: గీతా గోవిందం దగ్గరనుంచి ఇప్పటివరకు హీరో విజయ్ దేవరకొండ- హీరోయిన్ రష్మిక మందన్న మధ్య ఉన్న రిలేషన్ ఏంటి నేది ఎవరికి అంతుచిక్కని మిస్టరీ. తామిద్దరం స్నేహితులమని వారు చెప్పుకొస్తున్నా వారిని చూస్తుంటే అలా అనిపించడమే లేదు అంటున్నారు అభిమానులు. ఇక మొన్నటికి మొన్న ఈ జంట మాల్దీవులు వెళ్లి వచ్చినట్లు నెట్టింట రూమర్స్ గుప్పుమన్నాయి. ఇక త్వరలోనే ఈ జంట పెళ్లిచేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఇప్పటికే విజయ్ కు పెళ్లి అయిపోయిందని బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు తన స్వయంవరం గురించిన ఒక ప్రశ్న ఎదురైంది. ఒక వేళ మీకు స్వయంవరం కనుక చేయాల్సి వస్తే ఏ ఇద్దరు హీరోలు అందులో ఉండాలనుకుంటారు అని అడుగగా.. రణబీర్ కపూర్, టైగర్ ష్రాఫ్ అని జాన్వీ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటికే రణబీర్ కు పెళ్లి అయిపోయిందని, ఆ ప్లేస్ లో విజయ్ దేవరకొండను పెడదామని యాంకర్ అనగా.. లేదు లేదు.. విజయ్ కూడా పెళ్లి అయిపోయింది అని బాంబ్ పేల్చింది. ప్రాక్టికల్ గా విజయ్ కు ఎప్పుడో పెళ్లి అయిపోయిందిగా అంటూ నవ్వేసింది. అంటే జాన్వీ మాటలకు అర్ధం ఏంటి.. విజయ్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడా..? లేక పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడా..?. రష్మికతోనే ఆ వివాహం జరిగిందా లేక వేరే అమ్మాయితోనా అనేది తెలియాల్సి ఉంది.