Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా తెరంగేట్రం చేసింది జాన్వీ కపూర్. తల్లి అందచందాలను అందిపుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం వరుసగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ బ్యూటీ నటించిన తాజా చిత్రం మిలి త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ సినిమా ‘హెలెన్’కు రీమేక్ గా దర్శకుడు మత్తుకుట్టి జేవియర్ తెరకెక్కించిన ‘మిలీ’ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపింది.
Prabhas ‘Project k’ Update: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ అప్ డేట్ వచ్చేసింది
జాన్వీకపూర్ ఈ చిత్రంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిగా కనిపిస్తానని తెలిపింది. దర్శకుడి సూచన మేరకు పాత్రకు సెట్ అయ్యేలా 7.5కేజీల బరువు పెరిగానని చెప్పింది. ఈ విషయంలోనే తాను శారీరకంగానూ, మానసికంగానూ ఇబ్బంది పడినట్లు చెప్పింది. తాను పోషించిన పాత్ర(ఫ్రిడ్జ్ లో ఉన్నట్లు)కు సంబంధించిన దృశ్యాలు కలలోకి వచ్చేవి. సరిగా నిద్రపట్టేవి కాదని.. ఆరోగ్యం దెబ్బతిందని.. పెయిన్ కిల్లర్స్ సైతం వాడాల్సి వచ్చిందని వాపోయింది. తనతో పాటు దర్శకుడు కూడా అస్వస్థతకు గురైనట్లు చెప్పింది. రోజులో 15గంటలు ఫ్రీజర్ లో ఉండాల్సి వస్తే అక్కడ ఓ ఎలుక మీ వేళ్లను కొరుకుతుంటూ ఎలా ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉంది కాదా ఆ నేపథ్యంలోనే సినిమా తెరకెక్కిందని.. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని కలిగి ఉన్నానంటూ వివరించింది. చూడాలి సినిమా చూసిన ప్రేక్షకులు జాన్వీ కష్టానికి ఎలాంటి ప్రతిఫలం అందిస్తారో.