ద్వారంపూడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆయన క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తానంటూ జనసేనాని చీఫ్ చేసిన కామెంట్లపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ అనే వాడు నా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టలేక రూరల్ లో మీటింగ్ పెట్టాడు అని ఆయన అన్నారు. రాజకీయ వ్యభిచారి మాటలకి నేను స్పందించాలి.. అస్సలు జనసేన పార్టీని ఎవరిని ఉద్ధరించడానికి పెట్టాడు అని పవన్ కల్యాణ్ ను ద్వారంపుడి ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ ను నమ్మి వచ్చిన వారు ఎవరు ఉన్నారు.. నన్ను నమ్మిన వారు నాతోనే ఉన్నారు అని ఆయన అన్నారు.
Read Also: Kajal Agarwal: భగవంత్ కేసరి సైకాలజీని స్టడీ చేస్తున్నట్లు ఉంది
జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రథమ శిష్యుడుడి నేను అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నాడు. రెండు చోట్ల ఓడిపోయిన వాడివి నువ్వు..పొలిటికల్ గా జీరోవు.. అలాంటి వాడివి నన్ను విమర్శించే స్థాయి నీది కాదు అంటూ పవన్ కల్యాణ్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 14న ముఖ్యమంత్రికి అర్హుడును కాదు అన్నావు.. మూడు నెలల్లో మాట మార్చి సీఎం అవుతాను అంటున్నావు.. ప్యాకేజీ , సీట్లు బేరం కుదరక పోవడంతో రోడ్డు మీదకి వచ్చి నన్ను సీఎం చేయండి అంటున్నాడు పవన్ కల్యాణ్ అని ద్వారంపూడి అన్నారు.
Read Also: Virtual Girlfriend: భార్యని వదిలేసి మరీ.. ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌కు దగ్గరైన వ్యక్తి
కాకినాడలో నన్ను ఓడించడం నీ వల్ల కాదు.. బేడీలు సినిమాలలో వేసుకో.. నేను ఎవరి జోలికి వెళ్ళను.. నా జోలికి వస్తే ఉరుకోను అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పరిటాల రవి గుండు కొట్టించాడు.. సినిమాల్లో మాత్రమే నువ్వు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అవ్వగలవు అని ఎద్దేవా చేశాడు. నువ్వు ప్యాకేజీ స్టార్ అని ప్రజలకి తెలుసు.. తాగుబోతులు, హచ్ కుక్కలు చెప్పింది చెప్తావు.. కోతి చెప్పింది విని కోతి గంతులు వేస్తున్నావు.. కాకినాడ పోర్ట్ లో బియ్యం ఎగుమతులు పెరగడానికి మా ప్రభుత్వ విధానాలే కారణమని ద్వారంపూడి అన్నాడు. నీకు జ్ఞానం లేదు అనే విషయాన్ని మనోహర్ ని అడుగు అని తెలిపాడు.
Read Also: Maharashtra : బ్లాక్ మెయిల్ చేస్తూ బాలికపై అత్యాచారం..అక్కడ నొప్పిని భరించలేక..
నా దగ్గర 15 వేలు కోట్లు ఉంటే చంద్రబాబు ఎందుకు నేనే నిన్ను కొనేసివాడిని అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అన్నారు. పిచ్చిపిచ్చిగా వాగకు.. నేను తలచుకుంటే కాకినాడలో నీ బ్యానర్ కట్టనిచ్చే వాడిని కాదు.. నువ్వు ఉంటున్న క్లబ్ ప్రభుత్వ స్థలం కబ్జా చేసింది.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని తరిమిస్తే అన్ని కులాలు కలుస్తాయి.. చంద్రబాబుకి వచ్చేవి చివర ఎన్నికలు.. చంద్రబాబు లేకపోతే నీ దుకాణం బంద్ అయిపోతుంది అని అన్నాడు. దమ్ముంటే నువ్వు కాకినాడ లో పోటీ చేయి అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నిన్ను తుక్కు తుక్కుగా ఓడించకపోతే నా పేరు చంద్రశేఖర్ రెడ్డి కాదన్నాడు.