Dwarampudi Chandrasekhar Reddy Strong Counter To Pawan Kalyan: తనపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తానేమీ అన్నయ్య పేరో, తండ్రి పేరో చెప్పి రాజకీయాల్లోకి రాలేదని.. స్వతహాగా ఈ స్థాయికి ఎదిగానని చురకలంటించారు. గొడవల దగ్గర నుంచి కొట్టుకోవడం వరకూ తాను అన్ని చూశానన్న ఆయన.. కాకినాడలో కాంగ్రెస్ జెండాలు పాతి పాతి ఈ స్థాయికి వచ్చానన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే.. ఏమాత్రం చూస్తూ ఊరుకోననని, ఏ విషయంలోనూ తగ్గేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బీసీలకు తాము ఏం చేశామనే విషయంపై త్వరలో కాకినాడలో సభ పెడతామన్నారు. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ తన యాత్రలో భాగంగా తన గురించి మాట్లాడుతారని తాను అనుకుంటున్నానని.. పవన్ మాట్లాడాక రేపు ఉదయం అన్ని విషయాలు వివరంగా చెప్తానని అన్నారు. పవన్ తనపై చేసే ఆరోపణల్లో నిజం ఉంటే ఖండించనని, లేనిపోని ఆరోపణలు చేస్తే తప్పకుండా ఖండించడంతో పాటు ప్రశ్నిస్తానని తెలిపారు.
Adipurush: వివాదాల నేపధ్యంలో ‘ఆదిపురుష్’లో మార్పులు.. టీం సంచలన నిర్ణయం
గతంలోనూ ఓ మీడియా సమావేశంలో.. పవన్ కళ్యాణ్‌లో రాజకీయ లక్షణాలు ఏమీ లేవంటూ ద్వారంపూడి దుయ్యబట్టారు. రాజకీయాల్లో ఓడిపోతామని తెలిసి కూడా పోరాడేవాడే నిజమైన నాయకుడని, కానీ పవన్‌లో అలాంటి లక్షణాలు మచ్చుకు కూడా లేవని విమర్శించారు. నాయకత్వ లక్షణం అంటే వైఎస్ జగన్‌దేనని స్పష్టం చేశారు. యుద్దం నుండి ఎప్పుడైతే తప్పుకుంటామో, అప్పుడు వెనకున్న సైనికులు సైతం భయపడతారని వివరించారు. ఓడిపోతాం.. ముఖ్యమంత్రి అవ్వమంటే అది యుద్దమా? నాయకుడి లక్షణమా? అని ప్రశ్నించారు. నాయకత్వం అంటే జగన్‌దేనని.. ఏనాడూ ఆయన కార్యకర్తలకు అధైర్యాన్ని పంచలేదని.. తాను కష్టకాలంలో ఉన్నప్పటికీ కార్యకర్తల్లో ధైర్యం పంచాడని.. సిసలైన నాయకత్వ లక్షణం అంటే ఇదేనని సూచించారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కన్నా తాను సీనియర్‌ని అని.. కాకినాడ నుంచి పవన్, లోకేష్‌లలో ఎవరు పోటీకి ముందుకొచ్చిన తాను సిద్ధమేనని ఛాలెంజ్ చేశారు.
Boys Hostel: ఇంటి పక్కనే బాయ్స్ హాస్టల్.. మహిళ స్నానం చేస్తుండగా వీడియో