ప్రధాని మోడీ పర్యటన విజయవంతం అయ్యిందని.. భీమవరం కార్యక్రమం విజయవంతం కావడంతో భీమ్లానాయక్ గారు బిగుసుకుపోయారు.. చంద్రబాబు నీరుగారిపోయారు అంటూ సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా
విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమాన్ని జనసేన పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా అర్జీలను స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా తాము కృషి…
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కార్యకర్తలకు క్రియాశీలక శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన వీర మహిళల శిక్షణ తరగతుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రారంభమైనా చిన్నగానే ఉంటుందని.. బీజేపీ ఇద్దరు ఎంపీలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఇద్దరితో ప్రారంభమైన టీడీపీ ఇప్పుడు ఎవరి అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని శాసించగలిగే స్థాయికి వచ్చిందన్నారు. మహిళలు ముందుండి నడిపించకుంటే సమాజంలో మార్పు రాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.…
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి దగ్గర విద్యుత్ హై టెన్షన్ వైర్లు తెగిపడి ఆటో దగ్ధమైన ఘటనలు ఐదుగురు సజీవదహనం కావాడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మహిళా కూలీల సజీవ దహనం హృదయ విదాకరమన్న ఆయన.. కూలీల సజీవ దహనం ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు.. వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా ఆ వాహనంపై విద్యుత్ తీగలుపడి ఈ ఘోరం చోటు చేసుకొందని తెలిసిందని.. రెక్కల కష్టం మీద బతికే…
అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక సభ్యులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూలై 2న వీర మహిళలకు అవగాహన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ సిద్ధాంతాలను గ్రామగ్రామాన వివరించేందుకు పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక అవగాహన, పునశ్చరణ తరగతులను నిర్వహించబోతున్నట్లు వివరించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత, వీర మహిళలు చేసిన కృషి అనిర్వచనీయమని నాదెండ్ల మనోహర్…
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలో జనసేన పార్టీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘జనవాణి’ పేరుతో వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీని ద్వారా సామాన్య ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తులు స్వీకరించనున్నారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా వచ్చే ఐదు ఆదివారాలు పవన్ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి వారి నుంచి వివిధ అంశాలపై అర్జీలను స్వీకరిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. తొలివిడత జనవాణి కార్యక్రమాన్ని జూలై 3న విజయవాడలోని…
ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని జనసేన పార్టీ బలంగా విశ్వసిస్తోంది. వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో జనసేన పార్టీలోకి చేరికలు షురూ అయ్యాయి. ఈ క్రమంలో ఏపీ కేడర్‌లో ఐఏఎస్ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన దేవ వరప్రసాద్ గురువారం నాడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్‌కు జనసేన…
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది… జనసేనపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ దగ్గర గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనిని అడ్డుకునేందుకు యత్నించాయి జనసేన పార్టీ శ్రేణులు.. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. రంగంలోకి దిగిన పోలీసులు.. జనసేన నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేవారు.. ఈ నేపథ్యంలో.. జనసేన శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.. Read Also: Congress:…