కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం హర్షణీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ఓ లేఖ విడుదల చేశారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలకు పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని పవన్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. నిత్యావసర ధరల పెరుగుదలకు ఇంధన రేట్లే కారణమని.. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసరాల ధరలు కొంత వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. పీఎమ్ ఉజ్వల యోజన పథకంలో అందించే గ్యాస్ సిలిండర్లపై…
ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ముగించుకుని మంగళగిరి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోయింది. దీంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం సెల్ ఫోన్ వెలుగులోనే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ మరింత క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానన్నారు. రాజధాని విషయంలో బీజేపీ…
తిరుమలలో అమలవుతున్న విధానాలు, ధర్మారెడ్డి తీరుపై జనసేన మండిపడింది. ప్రభుత్వం మాదనే ఉద్దేశంతోనే ఇష్టమొచ్చినట్టు తిరుమలలో వ్యవహరిస్తున్నారని ఈవో ధర్మారెడ్డిపై మండిపడ్డారు జనసేన నేత కిరణ్ రాయల్. టీటీడీలో ఏదో జరుగుతోంది, జవహర్ రెడ్డి ని హడావుడిగా బదిలీ చేయడం వెనక కారణం ఏంటి…?గడువు ముగిసిన టీటీడీ ఈఓగా ధర్మారెడ్డిని కొనసాగింపు ఎందుకు….? అని ఆయన ప్రశ్నించారు. ధర్మారెడ్డి దేవస్థానం లా మార్చేశారు. ఏపీలో ఇంకెవరు ఐఏఎస్ లు లేరా…? ఐడిఈయస్ హోదా లో ఉన్న ధర్మారెడ్డి…
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. పవన్ కల్యాణ్ ఈ నెల 14న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. ఇటీవల మరణించిన జనసేన క్రీయాశీలక కార్యకర్తల కుటుంబాలను పరామర్శించున్నారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాకకు తెలంగాణ జనసేన శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. పవన్ కల్యాణ్ పర్యటనలో సీఎం కేసీఆర్‌పై ఏమైనా విమర్శలు చేస్తారా అని రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా గత కొన్ని…
ఏపీలో పొత్తులపై రాజకీయాలు వేడెక్కాయి. జనసేన, టీడీపీ పొత్తు అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు ఎన్నికలంటే భయపడుతున్నారని.. కానీ ఎన్నికలంటే భయపడాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. గడిచిన మూడేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. టీడీపీ హయాంలో టీడీపీ చేసిందేమీ లేదు కాబట్టే తనతో పొత్తు పెట్టుకోవాలని అందరి కాళ్ల, వేళ్ల మీద చంద్రబాబు…
రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 8వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. శిరివెళ్లలో ఓ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. ఇదివరకే అన్నదాతకు అండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన రైతు భరోసా యాత్ర సమయంలోనూ పవన్ పలువురు రైతులకు ఆర్థికసాయం అందించారు. 41 మంది రైతులకు రూ. 1 లక్ష చెక్‌లను…
తిరుపతిలో జనసేన పార్టీ వినూత్నంగా నిరసన చేపట్టింది. ఇటీవల జగన్ ఒంగోలు పర్యటన సందర్భంగా ఓ కుటుంబం తిరుపతి వెళ్తుండగా రవాణాశాఖ అధికారులు బలవంతంగా కారు తీసుకెళ్లడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా సీఎం జగన్ తిరుపతి పర్యటన ఖరారు కావడంతో జనసేన పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. తిరుపతి నగరంలోని బైరాగి పట్టెడ పార్క్ వద్ద ‘జగన్ వస్తున్నాడు కార్లు జాగ్రత్త’ అంటూ వినూత్నంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, పట్టణ…
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. సీబీఐ దత్తపుత్రుడు పాలన చేస్తున్నారా..? వడ్డీ వ్యాపారం చేస్తున్నారా..? అని ఫైర్ అయిన ఆయన.. రైతుల నుంచి నీటి తీరువాను వడ్డీ విధించి వసూలు చేస్తున్నారు.. అసలే, గిట్టుబాటు ధరలు రాక.. పండిన పంట చేతికొస్తుందో లేదో అర్థం కాని పరిస్థితుల్లో రైతుల నుంచి వడ్డీలు వసూలు చేస్తారా? 2018 నుంచి నీటి తీరువా లెక్కగట్టి 6 శాతం వడ్డీతో రైతుల…
నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. తొలుత హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న పవన్ కళ్యాణ్ అనంతరం రోడ్డు మార్గంలో కలపర్రు టోల్‌గేటు మీదుగా జానంపేట, అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా విజయరాయి, పెదవేగి, ధర్మాజీగూడెం, లింగపాలెంకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి మళ్లీ ధర్మాజీగూడెం మీదుగా చింతలపూడికి వెళ్తారు. చింతలపూడికి చేరుకునే మధ్యలో పలు గ్రామాల్లో కొందరు కౌలు రైతుల కుటుంబాలను…
ఏపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. అన్నదాతల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. రైతులకు భరోసా ఇచ్చేందుకే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈనెల 23న పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని ఆయన తెలిపారు. రైతుల కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు త్వరలో గుంటూరు జిల్లాలో కూడా పవన్…