Somu Veerraju key comments: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్న రెండు పార్టీలు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, వ్యాపార పార్టీలు అని టీడీపీ, వైసీపీలను ఉద్దేశించి ఆరోపించారు. టీడీపీ, వైసీపీలు కవల పిల్లలు అని అన్నారు. మళ్లీ మళ్లీ చెప్తున్నానని.. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతోనే తమ ప్రయాణం అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రూ. 7,798 కోట్లు ప్రాజెక్టులు…
pawan kalyan suffers with viral fever: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడినట్లు జనసేన పార్టీ సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్‌తో పాటు కొందరు ముఖ్య నాయకులు, ప్రోగ్రాం కమిటీ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా జ్వరాలతో అనారోగ్యం బారిన పడ్డారని.. ఈ నేపథ్యంలో ఈనెల 24న…
Pawan Kalyan comments on Flood Victims Difficulties: ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా ముంపు బాధితుల ఇక్కట్లు రోజురోజుకు పెరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. వరద బాధితుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బటన్ నొక్కడంతో బాధ్యత తీరిపోదని.. మానవత్వంతో స్పందించాలని పవన్ కళ్యాణ్…
Pawan Kalyan Bhimavaram Visit: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు భీమవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజావాణి-జనసేన భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి పలు వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భీమవరంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయని.. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నో సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. భీమవరం రాగానే డంపింగ్ యార్డ్ సమస్య ఏమైందని అడిగితే అప్పటికీ,…
కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.. గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు జనసేన పార్టీ శ్రేణులు.. దీంతో, జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.. ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో.. కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. ఇక, జనసేన నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా.. తామేం నేరం చేశామంటూ ఎదురు తిరిగారు జనసైనికులు.. దీంతో, భారీగా పోలీసులను మోహరించారు..…
ఏపీలో జనసేన పార్టీ మరో నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఏపీలో రోడ్ల దుస్థితిని తెలియజేసేందుకు #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్‌తో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈనెల 15, 16, 17 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జనసేన చేపట్టనున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ మేరకు తెనాలిలోని పార్టీ కార్యాలయంలో ఆయన డిజిటల్ క్యాంపెయిన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దారుణంగా ఉన్న రహదారులను కనీస మరమ్మతులు కూడా…
విజయవాడలో మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జనసేన ఆధ్వర్యంలో జనవాణి రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టగా స్థానికుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని జనవాణి కార్యక్రమం ద్వారా తాము చేస్తున్నామని తెలిపారు. వైసీపీ సర్కారు తన బాధ్యతలను మర్చిపోయిందని.. దీంతో సామాన్యులు, మధ్యతరగతి వాళ్లు నేడు నలిగిపోతున్నారని పవన్ ఆరోపించారు. తాను సంపూర్ణంగా ప్రజల పక్షాన నిలబడేందుకు వచ్చానని భరోసా ఇచ్చారు.…
వైసీపీ ప్లీనరీ ద్వారా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతమాత్రం శ్రేయస్కారం కాదన్నారు. వైసీపీ నేతలు మాట్లాడే భాష కనీసం మర్యాదపూర్వకంగా ఉండటం లేదని.. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలన్నారు. వైసీపీ చేపట్టిన గడప గడపకు కార్యక్రమం ఫెయిల్యూర్ కావడంతో సీఎం జగన్ ఫస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. 1.27 లక్షల కోట్లు ఏపీలోని రైతాంగాన్ని ఆదుకున్నామని…