ముంబైని కొట్టి.. క్వాలిఫయర్ అవకాశాన్ని అందుకున్న పంజాబ్! పదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన పంజాబ్ కింగ్స్.. నేరుగా క్వాలిఫయర్ ఆడే అవకాశాన్నీ ఒడిసిపట్టింది. రెండో దశలో వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన పంజాబ్.. 19 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుకు ఫైనల్ చేరడానికి క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పంజాబ్‌కు ఫైనల్ చేరేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. పంజాబ్‌పై…
జమ్మూకాశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పదవీ కాలంలో సాధారణంగా వేసవి రాజధాని శ్రీనగర్ ఉంటుంది. ఇక శీతాకాల రాజధాని జమ్మూ ఉంటుంది. కానీ ఈసారి ఈ రెండింటికి భిన్నంగా
MP DK Aruna: పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో.. బీజేపీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మీ దేశం మిగలదని మన సైనికులు సంకేతం ఇచ్చారు.. ఉగ్రవాదులను, దుండగులను ఐక్యతతో అంతం చేస్తామని తేల్చి చెప్పారు.
నరేంద్ర మోడీ పాలనలో భారత జాతి ప్రపంచంలో తలెత్తుకొని తిరుగుతుంది అని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అభివృద్ధి చెందుతోంది.. ఉగ్ర కుట్రలకు ప్రతిఫలం ఏంటో పాకిస్తాన్ చూసింది.. మా దేశ సమగ్రతను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే ఎవ్వరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని సంకేతాలు పాకిస్తాన్ కు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.
తుల్బుల్ బ్యారేజీ ప్రాజెక్టుపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. సీఎం ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ పోస్ట్‌ను రీ పోస్ట్ చేస్తూ, కొంతమంది ప్రజాదరణ పొందేందుకు, పాకిస్తాన్లో కూర్చున్న ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సింధు జలాల ఒప్పందాన్ని గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నేను ఈ ఒప్పందాన్ని ఎప్పుడూ వ్యతిరేకిస్తున్నానని, భవిష్యత్తులో కూడా వ్యతిరేకిస్తూనే ఉంటానని అన్నారు. ఈ ఒప్పందం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు…
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. ఇప్పటికే, ఈ ఒప్పందాన్ని నిలిపేయడంపై పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. అయితే, భారత్ వీటిన్నింటిని పట్టించుకోకుండా సింధు, దాని ఉపనదుల నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్లాన్ చేస్తోంది.
జమ్ము కాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. టెర్రర్ ఫ్రీ కాశ్మీర్ కోసం ఉగ్ర వేట కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని త్రాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. జైషే మహ్మద్ కు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో దాక్కున్నట్లు సమాచారం.ఈ ఎన్‌కౌంటర్ త్రాల్‌లోని నాదిర్ గ్రామంలో జరుగుతోంది. పుల్వామాలో 48 గంటల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్. మంగళవారం ఉదయం షోపియన్‌లో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులు హతమయ్యారు. Also Read:Assam Rifles…
శనివారం ఉదయం భారత్‌లోని అనేక ప్రాంతాలలో పాకిస్థాన్ డ్రోన్ దాడులను నిర్వహించింది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న వైమానిక దళ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే.. భారత సైన్యం, రక్షణ వ్యవస్థ శత్రు డ్రోన్‌ను గాల్లోనే కూల్చివేశాయి. ఈ సమయంలో వైమానిక దళ స్టేషన్లో విధుల్లో ఉన్న ఒక సైనికుడు వీరమరణం పొందాడు. పాకిస్థాన్ డ్రోన్ ముక్కను ఢీకొట్టడంతో అమరుడయ్యారు.
భారత్ లో పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులకు పాల్పడిన పాకిస్తాన్ సైన్యం పట్ల కఠినంగా వ్యవహరించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత సైన్యాన్ని ఆదేశించారు. నియంత్రణ రేఖ వద్ద భారత పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్న పాకిస్తాన్ సైన్యంపై కఠినమైన, శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారని వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ తాట తీయాల్సిందేనని సైన్యాన్ని ఆదేశించినట్లు సమాచారం. Also Read:India Pak War : భారత్‌లో 32 విమానాశ్రయాలు మూసివేత.. భారతదేశం-పాకిస్తాన్…