Kashmiri Nurse Murder: కాశ్మీరీ నర్సు హత్య కేసులో ట్విస్ట్.. 35 ఏళ్ల తర్వాత కీలక దర్యాప్తు
- కాశ్మీరీ నర్సు హత్య కేసులో ట్విస్ట్
- 35 ఏళ్ల తర్వాత కీలక దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్‌లోని 35 ఏళ్ల క్రితం హత్యకు గురైన కాశ్మీరీ పండిట్ సరళా భట్ కేసుపై దర్యాప్తు సంస్థ దృష్టిపెట్టింది. మంగళవారం రాష్ట్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ కాశ్మీర్‌లో దాడులు చేపట్టింది. ఎనిమిది ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 35 ఏళ్ల తర్వాత అతి పెద్ద చర్యగా దీన్ని చెప్పొచ్చు.
ఇది కూడా చదవండి: US: మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారు.. అమెరికాకు గుణపాఠం నేర్పారన్న పెంటగాన్ మాజీ అధికారి
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ ఇల్లు కూడా ఉంది. ప్రస్తుతం మాలిక్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సరళా భట్ హత్యకు సంబంధించి గతంలో నిషేధిత జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌తో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తుల ఇళ్లపై ఏజెన్సీ దాడులు నిర్వహించిందని అధికారులు తెలిపారు.
యాసిన్ మాలిక్ తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఉగ్ర నిధుల కేసుకు సంబంధించి అతనికి మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ కోరింది. కానీ ఆయనకు జీవతఖైదు విధించబడింది.
సరళా భట్..
సరళా భట్.. కాశ్మీర్ పండిట్ కుటుంబంలో జన్మించింది. వైద్య వృత్తిపై కోరికతో నర్సింగ్ మార్గాన్ని ఎంచుకుంది. శ్రీనగర్‌లోని షేర్-ఎ-కాశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో తన వృత్తిని కొనసాగిస్తోంది.
1990, ఏప్రిల్ 14న హాస్టల్ గది నుంచి అపహరణకు గురైంది. జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన రాడికల్ జిహాదీలు అపహరించి తీసుకెళ్లిపోయారు. అనంతరం నాలుగు రోజుల పాటు బంధించి సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. ఏప్రిల్ 19న శ్రీనగర్ డౌన్‌టౌన్‌లో శవమై కనిపించింది. దేహంలో బుల్లెట్ గాయాలు కనిపించాయి. పోలీస్ ఇన్ఫార్మర్ అంటూ చేతిలో చీటి రాసి ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందించిందన్న కోపంతో ఆమెను అత్యంత దారుణంగా చంపేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థ దృష్టి పెట్టింది.
ఇది కూడా చదవండి: US: ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. భారీగా మంటలు
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!