Terrorist Attacks: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడుల ఉద్దేశ్యం ఏమిటి..?
- జమ్మూ కాశ్మీర్‌లో వరసగా ఉగ్రదాడులు..
- మోడీ ప్రమాణస్వీకారం నుంచే దాడులు మొదలు..
- పరిస్థితులు సరిగా లేవని చెప్పేందుకే ఉగ్రదాడులు..
- మరోసారి మోడీ అధికారంలోకి రావడంతో రగిలిపోతున్న పాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Attacks: జమ్మూ కాశ్మీర్‌లో వరసగా జరుగుతున్న ఉగ్రవాద ఘటనలు ఆ రాష్ట్రంలో మరోసారి భయాందోళనల్ని పెంచాయి. గత ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజునే, ఉగ్రవాదులు రియాసి జిల్లాలో శివ్ ఖోరీ నుంచి కత్రాకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఆ తర్వాత వరసగా కథువా, దోడా ప్రాంతాల్లో మూడు ఉగ్రవాద ఘటనలు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చగా.. ఒక జవాన్ అమరుడయ్యారు.
అయితే, ఇటీవల కాలంలో పీర్ పంజాల్ పరిధి దిగువన ఉన్న జమ్మూలో ఉగ్రవాద ఘటనలు గణనీయంగా పెరిగాయి. రిటైర్డ్ ఆర్మీ అధికారుల ప్రకారం.. ప్రధానిమోడీ, ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారం చేపడుతున్న సమయంలో, మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పరిస్థితుల్ని చక్కదిద్దలేదనే అభిప్రాయాన్ని కలిగించేందుకే బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హుస్నైన్(రిటైర్డ్) అన్నారు. 2000లో జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని చిట్టి సింగ్ పోరా గ్రామంలో ఉగ్రవాదులు 35 మంది సిక్కు యాత్రికులను కాల్చి చంపిన అంశాన్ని ఉదహరించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పార్లమెంట్‌లో ప్రసంగించేందుకు ఒక రోజు ముందు ఈ ఘటన జరిగిందని గుర్తు చేశారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Read Also: Heavy Rains: చురుగ్గా రుతుపవనాలు కదలిక.. నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన..
మోడీ మరోసారి ప్రధానిగా ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మోడీ తన ప్రభుత్వ విజయాలను చెబుతున్న సందర్భంలోనే, జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితులు బాగా లేవని చూపించాలని శత్రుదేశం పాకిస్తాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఉగ్రవాద దాడుల్ని ప్రోత్సహిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు విజయవంతగా ముగిసిన తర్వాత, మళ్లీ ప్రధాని మోడీ మూడోసారి అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ ఏదో ఒకటి చేయాలనే లక్ష్యంతో వ్యవహరిస్తోంది. ఆర్మీ ఆపరేషన్ల వల్ల గత కొంత కాలంగా ఉగ్రవాదుల్ని మట్టుబెడుతున్నారు. కాశ్మీరీ యువత టెర్రరిజం నుంచి బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ఉనికిని చాటుకునేందుకు ఈ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో పోలిస్తే ఉగ్రదాడుల భిన్నంగా జరుగుతున్నాయి. కొన్ని చిన్నచిన్న గ్రూపులు టార్గెటెడ్ కిల్లింగ్స్ చేపడుతున్నాయి. వీరంతా బాగా శిక్షణ తీసుకుని ఉన్నారు. ముఖ్యంగా ‘‘జింగిల్ వార్‌ఫేర్’’లో ఆరితేరారు. అడవుల్లో రోజుల పాటు మకాం వేసి, గుహల్లో నివసిస్తూ అదును చూసి ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దానికి ఆటంకం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!