Chenab Railway Bridge: ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై నుంచి రైలు ప్రయాణం.. ట్రయర్ రన్ వీడియో వైరల్..
- చీనాబ్ రైల్వే వంతెనపై ట్రయల్ రన్ సక్సెస్..
- జమ్మూ కాశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మాణం..
- ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనగా గుర్తింపు..
- జమ్మూ కాశ్మీర్‌ని దేశంతో అనుసంధానించే ప్రాజెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chenab Railway Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైల్వే బ్రిడ్జ్‌ని నిర్మించి భారత్ రికార్డ్ సృష్టించింది. జమ్మూ కాశ్మీర్‌లో రైల్వే మార్గానికి ఎంతో కీలకమైన ‘‘చీనాబ్ రైల్వే వంతెన’’ పై నుంచి ఈ రోజు భారతీయ రైల్వే విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది. రాంబన్ జిల్లాలోని సంగల్దాన్-రియాసీ మధ్య చీనాబ్ నదిపై ఈ వంతెనను నిర్మించారు. ఈ మార్గంలో త్వరలోనే రైలు సేవలు ప్రారంభం కానున్నాయని అధికారలు తెలిపారు. ట్రయల్ రన్‌లో రైలు జమ్మూ కాశ్మీర్‌లోని అందమై పర్వతాల మధ్య ఉన్న చీనాబ్ వంతెన పై నుంచి ప్రయాణించడం చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Read Also: Summer solstice: రేపు ఏడాదిలోనే ‘‘సుదీర్ఘమైన పగలు’’.. అయనాంతాలు అంటే ఏమిటి, ఎలా ఏర్పడుతాయి..?
Also Read
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
ఈ వంతెన చీనాబ్ నదికి ఎగువన 359 మీటర్లు( సుమారు 109 అడుగులు) ఎత్తులో నిర్మితమైంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా దాదాపుగా 35 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఉదంపూర్ శ్రీనగర్ బాలాముల్లా రైల్ లింక్(USBRL) ప్రాజెక్ట్ కింద ఈ వంతెనను నిర్మించారు. ఇది జమ్మూని, కాశ్మీర్‌ని రైలుతో అనుసంధానిస్తుంది. కాశ్మీర్‌ని మిగతా దేశంతో కలుపుతుంది. 48.1 కి.మీ పొడమైన బనిహాల్-సంగల్దాన్ సెక్షన్ ప్రాజెక్టును ఫిబ్రవరి 20,2024న ప్రధాని మోడీ ప్రారంభించారు.
తాజాగా జరిగిన రైలు ట్రయల్ రన్‌కి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సంగల్దాన్-రియాసి సెక్షన్ల మధ్య MEMU రైలు ట్రయల్ రన్ విజయవంతమైందని ప్రకటించారు. 118 కి.మీ ఖాజిగుండ్-బారాముల్లా మధ్య కవర్ చేసే ప్రాజెక్టుని ఫేస్-1 పనుల్ని అక్టోబర్ 2009లో ప్రారంభించారు. తదుపరి దశల్లో 18 కి.మీ బనిహాల్-ఖాజీగుండ్ సెక్షన్ ని జూన్ 2013లో, 35కి.మీ ఉధంపూర్-కత్రా సెక్షన్‌ని జూలై 2014లో ప్రారంభించారు.
#WATCH | J&K: Indian Railway conducts a trial run on the newly constructed world's highest railway bridge-Chenab Rail Bridge, built between Sangaldan in Ramban district and Reasi. Rail services on the line will start soon pic.twitter.com/gHGxhMHYe3
— ANI (@ANI) June 20, 2024
Successful trial run of MEMU train between Sangaldan – Reasi section of USBRL project.
📍Jammu & Kashmir pic.twitter.com/GjaKX6Ci8Q
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 20, 2024
తాజావార్తలు
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
-
Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!