Jammu Kashmir: జమ్మూలో 35-40 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు.. భద్రత కట్టుదిట్టం..
- జమ్మూ కాశ్మీర్‌లో క్రియాశీలకంగా పాక్ ఉగ్రవాదులు..
- 35-40 మంది ఉంటారని ఇంటెలిజెన్స్ అంచనా..
- కథువా
- రాజౌరీ
- రియాసీలో భారీ సెర్చ్ ఆపరేషన్..
- కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన భద్రతా బలగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజే ఉగ్రవాదులు యాత్రికులు బస్సుపై దాడికి తెగబడ్డారు. రియాసిలో జరిగిన ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వరస రోజుల్లో కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రధాని నరేంద్రమోడీ కేంద్రపాలితప్రాంతంలో భద్రత పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర ఉన్నతాధికారులతో హై లెవల్ మీటింగ్ నిర్వహించారు.
Read Also: Parliament Sessions: సోమ, మంగళవారాల్లో ఎంపీల ప్రమాణం.. స్పీకర్ ఎంపికపై ఉత్కంఠ
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండలు, లోయలు సెర్చ్ ఆపరేషన్‌కి సంక్లిష్టంగా మారాయి. జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్, కథువా సెక్టార్లలో 35-40 మంది విదేశీ ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ మూలాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచే ప్రయత్నంలో స్థానిక గైడ్‌లు, సపోర్ట్ నెట్వర్క్‌ల సాయంతో చిన్న బృందాలుగా పనిచేస్తున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.
ఈ ఉగ్రవాదులు 2-3 గ్రూపులుగా పనిచేస్తున్నారని, స్థానిక సహాయక వ్యవస్థలో బాగా కలిసిపోయారని భద్రతా వ్యవస్థలోని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిలిటరీ, ఇతర భద్రతా సంస్థలు తమ గూఢచార కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. సరిహద్దుల్లో చొరబాటు ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ సరిహద్దును పర్యవేక్షించడం, ఉగ్రవాద వ్యతిరేక గ్రిడ్ ఏర్పాటు చేయడం, ఉగ్రవాదులకు సాయం చేస్తున్న స్థానికుల నెట్వర్క్‌ని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత సైన్యం ఇప్పటికే 200కి పైగా సాయుధ రక్షిత వాహనాలతో కూడిన అదనపు బలగాలను మోహరించాయి.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!