Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలకు కారణమవుతున్నాయి. కాంగ్రెస్-ఎన్సీ పొత్తుపై బీజేపీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే ప్రతిస్పందించారు. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ,హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రధాని మోడీ, అమిత్ షాలు ఇటీవల మాట్లాడుతూ.. కాంగ్రెస్-ఎన్సీ కూటమి పాకిస్తాన్ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుందని ఆరోపించారు.
JK Elections: పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో నేటి నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఆర్టికల్ 370ని తొలగించి, లడఖ్‌ను విభజించిన తదుపరి, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత ఇది మొదటి ఎన్నికలు. ఈరోజు (బుధవారం) న మొదటి దశలో మొత్తం 24 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందుకు గాను బరిలో 219 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ బూత్‌ల వద్ద…
Sam Pitroda: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఇండియా టుడే రిపోర్టర్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన వివాదంగా మారింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ఫైర్ అయ్యారు. జర్నలిస్టు పట్ల వ్యవహరించిన తీరు అమెరికా గడ్డపై భారతదేశ ప్రతిష్టను తగ్గించిందని ప్రధాని మోదీ అన్నారు.
PM Modi: అమెరికాలో రాహుల్ గాంధీ టీమ్ ఇండియా టుడే జర్నలిస్టుపై జరిపిన దాడిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్రూరత్వానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో కాశ్మీర్‌లోని దోడాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అమెరికాలో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఉద్దేశిస్తూ, రాహుల్ గాంధీ ‘మొహబ్బత్‌కి దుకాన్’ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని ప్రజలు భారత్‌లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి రాకేష్ సింగ్ ఠాకూర్‌కి మద్దతుగా రాంబన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. పీఓకే ప్రజలు భారత్‌లో వచ్చి చేరాలని, వారిని విదేశీయుల్లా చూసే పాకిస్తాన్‌లా కాకుండా సొంతవారిలా ఆదరిస్తామని చెప్పారు.
Afzal Guru: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. 2001లో పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో ఉగ్రవాది అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల ఏం ప్రయోజనం లేదని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది.
Amit Shah: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న బీజేపీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. రాహల్ గాంధీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్సీ-కాంగ్రెస్ కూటమి వేర్పాటువాదులను, ఉగ్రవాద సానుభూతిపరులను విడుదల చేయాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్‌ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా.. ఎన్సీ, కాంగ్రెస్…
Article 370: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన మేనిఫెస్టోని విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఆయన తోసిపుచ్చారు.
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. వచ్చే నెల ఆఖరులో మూడు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరగబోయే తొలి ఎన్నికలు ఇవే. ఇదిలా ఉంటే, కాశ్మీరీ కీలక నేత, మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ) అధినేత మెహబూబా ముఫ్తీ తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయినప్పటికీ పార్టీ ఎజెండాను అమలు చేయడం సాధ్యం కాదని అన్నారు.…
జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల తేదీలు ప్రకటించారు. భారత్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల కార్యకలాపాలు తీవ్రంగా ఉంటాయి. ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్థాన్‌కు ఇదంతా ఆమోదయోగ్యంగా లేదు.