Amit Shah: మూడు కుటుంబాలు కాశ్మీర్‌ని దోచుకున్నాయి.. అమిత్ షా అటాక్..
- జమ్మూ కాశ్మీర్‌ని కాంగ్రెస్..ఎన్సీ.. పీడీపీ దోచుకున్నాయి..
- మళ్లీ ఉగ్రవాదాన్ని.. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలని ప్రయత్నం..
- రాహుల్ గాంధీ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం ఆపాలి..
- ప్రతిపక్షాలపై అమిత్ షా అటాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న బీజేపీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. రాహల్ గాంధీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్సీ-కాంగ్రెస్ కూటమి వేర్పాటువాదులను, ఉగ్రవాద సానుభూతిపరులను విడుదల చేయాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్‌ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
జమ్మూ కాశ్మీర్ బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా.. ఎన్సీ, కాంగ్రెస్ రాళ్లు రువ్వే వారిని విడుదల చేయాలని కోరుకుంటున్నాయని మండిపడ్డారు. వారు రాజౌరీ, పూంచ్‌లలో ఉగ్రవాదాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌కి ఇబ్బంది కలిగించే వారిని మేము జైలులో పెడితే, వారు ఎల్ఓసీ వద్ద ఉగ్రవాదాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నారని, దీని వల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు..? అని ప్రశ్నించారు.
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
Read Also: Budameru: ఆపరేషన్ బుడమేరు సక్సెస్.. మూడో గండిని పూడ్చివేసిన అధికారులు
మెహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి)తో కలిసి ఎన్‌సి-కాంగ్రెస్ కూటమి ఈ ప్రాంతాన్ని “ఉగ్రవాద మంటలోకి” నెట్టేందుకు ప్రయత్నించిందని షా ఆరోపించారు. పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ కుటుంబాలు జమ్మూ కాశ్మీర్‌ని దోచుకున్నాయని అన్నారు. బీజేపీ అధికారంలో వస్తే టెర్రరిజాన్ని లేకుండా చేస్తామని అన్నారు. ఎన్సీ-కాంగ్రెస్ కూటమి జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయని, అది ఎన్నటికీ జరగదని అమిత్ షా అన్నారు.
రాష్ట్ర హోదా పునరుద్ధరణ హామీలతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. “రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పారు. అలా చేసే అధికారం ఆయనకు ఉందా? ఎన్నికల తర్వాత తగిన సమయంలో రాష్ట్ర హోదాను తిరిగి ఇస్తామని నేను పార్లమెంటులో చెప్పాను” జమ్మూ కాశ్మీర్ ప్రజల్ని మోసం చేయడం ఆపాలని రాహుల్ గాంధీని కోరారు. శంకరాచార్య కొండ పేరును తఖ్త్-ఎ-సులేమాన్‌గా మార్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, గుజ్జర్, బకర్వాల్ మరియు పహారీ వర్గాల వారి రిజర్వేషన్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ చర్యను అడ్డుకుంటామని షా అన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో 2014 తర్వాత, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. 90 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీకి 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ సెప్టెంబర్ 18న, రెండో దశ సెప్టెంబర్ 25, మూడో దశ అక్టోబర్ 01న జరుగుతాయి. అక్టోబర్ 08న కౌంటింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!