Jammu Kashmir: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ను జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా బీజేపీ అధిష్టానం నియమించింది.
Jammu Kashmir Elections: మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అన్నింటి కన్నా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడుతల్లో అంటే సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 01 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మిగతా రాష్ట్రాలతో కలిసి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కూడా అక్టోబర్ 04న విడుదల కానున్నాయి.
PM Modi: అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్ర హోదా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎన్నో రోజుల నుంచి కోరుతున్న అంశాలు. ఈ అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రసంగించారు.
Farooq Abdullah: అధికారంలో ఉండేందుకు శ్రీ రాముడి పేరును బీజేపీ ఉపయోగిస్తోందని, అయితే రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదని అందరికి దేవుడే అని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్‌సి చీఫ్ డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. భగవాన్ రామ్ ప్రతి ఒక్కరికీ దేవుడు, ముస్లిం-క్రిస్టియన్, అమెరికన్, రష్యన్ ఇలా అతడిపై విశ్వాసం ఉన్నవారు చాలా మంది ఉన్నారని ఆయన అన్నారు.
ఎన్నికలు ప్రజల హక్కు అని... జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కశ్మీరీలు కేంద్రం ముందు అడుక్కోరని.. వారు బిచ్చగాళ్లు కాదని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా అన్నారు.
Congress Opposes Inclusion Of "Non-Locals" In Jammu-Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులను ఓటర్లగా ఓటర్ జాబితాలో చేర్చడాన్ని కాశ్మీరీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఈ అంశంపై తమ నిరసనను తెలియజేశాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా స్థానికేతరులకు ఓటుహక్కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై న్యాయపరంగా పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులు ఓటు వేసేందుకు అనుమతించడం చట్టవిరుద్ధమని కాంగ్రెస్ పార్టీ…
Mehbooba Mufti criticizes BJP: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడీపీ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ గురువారం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో స్థానికులను నిర్వీర్యం చేయడానికి బీజేపీ పార్టీ ఇజ్రాయిల్ తరహా విధానాన్ని అవలంభిస్తోందని విమర్శించారు. స్థానికేతరులకు ఓటు కల్పించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఎన్నికల్లో బీజేపీ గెలిచే కుట్రగా అభివర్ణించారు. కాశ్మీర్ లో పడే ప్రతీ రక్తపు చుక్కను బీజేపీ క్యాష్ చేసుకుంటోందని విమర్శించారు. బీజేపీ వారు…